మిత్రుల పనే: గౌరీ శ్రీవాస్తవను సజీవంగా ముక్కలుగా నరికారు

లక్నో: తీవ్ర సంచలనం సృష్టించిన 20 ఏళ్ల గౌరీ శ్రీవాస్తవ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పోలీసులు ఆమె మిత్రులను అరెస్టు చేశారు. అత్యంత దారుణమైన ఆ హత్యకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో యావత్తూ విస్తుపోయింది. బతికుండగానే ఆమెను ముక్కలు ముక్కలుగా నరికినట్లు శవపరీక్షలో తేలింది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

న్యాయశాస్త్ర విద్యార్థిని గౌరీ శ్రీవాస్తవ హత్య కేసులో హిమాంశు ప్రజాపతి (23), అతని మిత్రుడు అనుజ్ గౌతంలను నిందితులుగా గుర్తించి, వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారం రోజుల పాటు అధునాత పద్ధతుల్లో దర్యాప్తు జరిపి, వేటాడి వారిని పోలీసులు పట్టుకున్నారు. గత 18 నెలలుగా గౌరీ శ్రీవాస్తవ, ప్రజాపతి మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్స్ ద్వారా టచ్‌లో ఉన్నారు. తనను మోసం చేసిందనే ఆగ్రహంతో ప్రజాపతి ఆ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు.

ఆమె మొబైల్‌లో సేవ్ చేసిన అభ్యంతరకరమైన చిత్రాలను చూసి ప్రజాపతి శ్రీవాస్తవ గొంతు నులిమాడి, రంపం ఉయోగించి ఆమె దేహాన్ని ముక్కలు ముక్కులగా నరికాడని పోలీసు డైరెక్టర్ జనరల్ ఎకె జైన్ చెప్పారు. నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రజాపతికి సహకరించాడనే ఆరోపణపై పోలీసులు గౌతమ్‌ను అరెస్టు చేశారు. బతికుండగానే ఆమెను ముక్కలుగా నరికినట్లు శవపరీక్ష నివేదిక చెబుతుండగా గొంతు నులిమి చంపిన తర్వాత శరీరాన్ని ముక్కలుగా నరికాడని జైన్ చెబుతున్నారు. గొంతు నులమడం వల్లనే ఆమె చనిపోయినట్లు శవపరీక్షలో లేదు.

ఆమెను నరికి శరీర భాగాలను సాహిద్ పథ్ ప్రాంతంలో కిలోమీటరు విస్తీర్ణంలో చెల్లాచెదురుగా పడేశారు. గౌరీ ఫిబ్రవరి 1వ తేదీన తన మిత్రుడితో లౌటచే రోడ్డులో మెటారు సైకిల్‌పై ఉన్నట్లు సిసిటీవి ఫుటేజీని పరిశీలిస్తే తెలిసింది. పది నిమిషాల్లో వస్తానంటూ ఆమె బయటకు వెళ్లిపోయింది. మూడు నాలుగు గంటల తర్వాత కూడా ఆమె తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

Lucknow Police arrest Gauri Srivastava’s killers; ‘she was chopped alive’

ఫిబ్రవరి 2వ తేదీన ముక్కలు ముక్కలుగా నరికిన గౌరీ మృతదేహం ఎస్‌జిపిజిఐ రోడ్డు పోలీసు స్టేషన్ పరిధిలో కనిపించింది. కొన్ని శరీర భాగాలు గోనె సంచీలో కుక్కి ఉన్నాయి. కేసును ఛేదించడానికి పోలీసులు ఎలక్ట్రానిక్ నిఘాపై ఆధారపడ్డారు. భాధితురాలి ఫోన్ ఇంటర్నెట్ వాడకాన్ని విశ్లేషించి పోలీసులు హంతకుడి జాడ కనిపెట్టారు.

కేసు దర్యాప్తునకు అధునాతన పద్ధతులను అవలంబించామని పోలీసులు అంటున్నారు. ఇంటర్నెట్ లాగ్ అనాలిసిస్‌ను వాడారు. దాంతో హంతకుడిని ఇంటిని కనిపెట్టారు. నిందితుడి నుంచి మృతురాలి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు వాడిన రంపాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+