టైపిస్టు మాస్టర్ కు పోలీసు ఎస్కార్టు (వీడియో)
లక్నో: దేశ వ్యాప్తంగా ఇటీవల వార్తలలో నిలిచిన లక్నో టైపిస్టు పెద్దాయనకు పోలీసు అధికారులు అండగా నిలిచారు. ఆయన ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి తరువాత ఇంటికి వెళ్లే వరకు పోలీసులను ఎస్కార్ట్ గా పంపిస్తున్నారు.
మీరు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు చెప్పారు. లక్నో జనరల్ పోస్టాఫీసు దగ్గర ఉన్న ఫుట్ పాత్ మీద కిషన్ కుమార్ (65) అనే పెద్దాయన గత 35 సవత్సరాల నుంచి టైప్ రైటర్ సహాయంతో బతుకుతున్న విషయం తెలిసిందే.

గత శనివారం ఓ ఎస్ఐ అక్కడికి వెళ్లి కిషన్ కుమార్ టైప్ రైటర్ ను ధ్వంసం చేసి నానా హంగామా చేశాడు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదేశాల మేరకు ఆ ఎస్ఐని సస్పెండ్ చేశారు. తరువాత కిషన్ కుమార్ కు ఓ బెదిరింపు ఫోన్ వెళ్లింది.
నువ్వు చేసింది మంచి పనికాదు, నీ అంతు చూస్తాం అని బెదిరించారు. అయితే ఇంటర్నెట్ ద్వారా ఆ ఫోన్ వెళ్లడంతో నెంబర్ చూడటం కష్టం అయ్యింది. కిషన్ కుమార్ ఫిర్యాదు మేరకు ఆయనకు పోలీసులను ఎస్కార్టుగా పంపించామని, కేసు దర్యాప్తులో ఉందని లక్నో సీనియర్ పోలీసు అధికారి రాజేష్ పాండీ చెప్పారు.












Click it and Unblock the Notifications