Chandra Grahanam 2021:గ్రహణం రోజు ఏం చేయాలి- ఆహారం ఏం తీసుకోవాలి - ఎలాంటి మంత్రం పటించాలి..?
ఓ వైపు దేశాన్ని కరోనా కుదిపేస్తుంటే.. మరో వైపు సహజ విపత్తులు కూడా పగబట్టినట్లు కనిపిస్తున్నాయి. గత వారం తౌటే తుఫాను ధాటికి పలు రాష్ట్రాల్లో భారీ నష్టం వాటిల్లింది. ఇక తాజాగా ఆకాశంలో మరో అద్భుతం చోటుచేసుకోనుంది. ఈ నెల 26వ తేదీన బుధవారం చంద్రుడు.. భూమికి దగ్గరగా వస్తాడు. సాధారణ రోజుల్లో కంటే పెద్దగా కనిపిస్తాడు. ఎరుపు, నారింజ రంగుల్లో కనిపిస్తాడు. అందుకే్- దీనికి సూపర్ బ్లడ్ మూన్ (Super Blood moon), రెడ్ మూన్ (Red Moon)గా పేరు పెట్టారు.ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా పశ్చిమ ప్రాంత రాష్ట్రాలు, దక్షిణ అమెరికాలోని కొన్ని చోట్ల, ఆసియా ఈశాన్య ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. సుమారు 15 నిమిషాల పాటు చంద్రుడిని గ్రహణం కప్పి ఉంచుతుందనే అంచనాలు ఉన్నాయి.

భారత్‌లో పాక్షిక చంద్ర గ్రహణం
భారత్‌లో పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. దేశం మొత్తం ఈ గ్రహణాన్ని తిలకించ లేకపోవచ్చు. కొన్ని ప్రదేశాల్లో పాక్షికంగా ఈ గ్రహణాన్ని వీక్షించడానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి- ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సూపర్ బ్లడ్‌మూన్ పాక్షికంగా కనిపిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలకు ఆనుకుని ఉండే పశ్చిమ బెంగాల్‌లోనూ పాక్షికంగా చంద్రగ్రహణం దర్శనమిస్తుంది. ఇక ఈ చంద్రగ్రహణంకు తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉండదని పలువురు చెబుతున్నారు. అయితే ఈ చంద్ర గ్రహణం రోజున ఎలాంటివి చేయొచ్చు.. ఎలాంటివి చేయకూడదనే విషయాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాం.

గ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు
సాధారణంగా సూర్యుడు మరియు చంద్రుడికి మధ్యలో భూమి వస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో భూమి చంద్ర ఉపరితలం ద్వారా ప్రతిబింబించే సూర్యకాంతిని అడ్డుకుంటుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 26న సంభవిస్తుంది. అయితే ఇది చాలా ప్రత్యేకమైన చంద్రగ్రహణం అని చెప్పుకోవాలి. భారత్‌లో ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 2 గంటల 17 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 7 గంటల 19 నిమిషాలకు ముగుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు పాక్షిక గ్రహణం కనిపిస్తుంది. ఇది సాయంత్రం 6 గంటల 22 నిమిషాలకు ముగుస్తుంది.

మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి
ఇక సైన్స్ ప్రకారం కళ్లతోనే నేరుగా గ్రహణం వీక్షించొచ్చు.కాబట్టి ఈ చంద్రగ్రహణంను వీక్షించేందుకు ప్రత్యేకమైన పరికరాలంటూ ఏమీ అవసరం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే చంద్రగ్రహణం గురించి భారతీయ పురాణాలు కూడా కొన్ని విషయాలను చెబుతున్నాయి. ఆరోజున ఏం చేయాలి ఏం చేయకూడదనే విషయాలను తెలుసుకుందాం. చంద్రగ్రహణం రోజున మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలని పురాణాలు చెబుతున్నాయి. ఇలా మంత్రాన్ని జపించడం ద్వారా గ్రహణం వల్ల వాటిల్లే నష్టాలు జరగవని చెబుతున్నాయి.

దానాలు విరాళాలు ఇవ్వాలి
మన కుటుంబంలో మంచి జరగాలంటే చంద్రగ్రహణం రోజున ఆహారంలో తులసి ఆకులను చేర్చాలని సూచిస్తున్నాయి. అంతేకాదు అవసరంలో ఉన్నవారికి అన్నదానం లేదా విరాళాలు ఇచ్చి ఆదుకుంటే అంతా శుభమే జరుగుతుందని చెబుతున్నాయి. ఇక సరిగ్గా వండకుండా ఉండే ఆహారాన్ని గ్రహణం రోజున తీసుకోకూడదట. ఇక చంద్రగ్రహణం సమయంలో ఇంటి నుంచి బయటకు కాలు పెట్టకూడదని దీని వల్ల ప్రమాదకరమైన కాంతికిరణాలు చర్మంపై పడే అవకాశం ఉందని కొన్ని చోట్ల చెబుతుంటారు.












Click it and Unblock the Notifications