వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పక్కనే కూతురు: భుజంపై భార్య శవంతో 10 కిమీ నడిచిన గిరిజనుడు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: తాళి కట్టిన భార్య అనారోగ్యంతో అర్ధాంతరంగా కన్ను మూయడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు డబ్బుల్లేక, భుజాన వేసుకుని 10 కిలోమీటర్లు నడిచాడో భర్త. దీనికి సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ హృదయ విదారక ఘటన దేశంలో అత్యంత పేద రాష్ట్రంగా పిలువబడుతోన్న ఒడిశాలో జరిగింది. ఆ సమయంలో తన వెంట 12 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. వివరాల్లోకి వెళితే మేఘారా అనే గ్రామంలో దనమాజీ(42), అమాంగ్ దేయి అనే గిరిజన దంపతులున్నారు.

ఈ దంపతులకు 12 ఏళ్ల కూతురు కూడా ఉంది. గత కొద్ది కాలంగా అమాంగ్ క్షయ వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో అమాంగ్‌కు వ్యాధి ముదరడంతో చికిత్స కోసం గ్రామానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలహండి అనే పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.

From Hospital, Odisha Man Carried Wife's Body 10 Km With Daughter

అక్కడ ఆమె చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచింది. అయితే, ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ఆస్పత్రిలో ఏ ఒక్కరూ అతనికి సహకరించలేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 'మహాపారాయణ' అనే పథకం ప్రారంభించారు.

దీని ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోయినవారి మృతదేహాలను వారి స్వగ్రామాలకు ప్రభుత్వం తరుపున ఉచితంగా చేర్చడం ఈ పథకం ఉద్దేశం. కానీ దనమాజీ భార్యను తరలించేందుకు మాత్రం ఆస్పత్రి వర్గాలు సహకరించలేదు. దీంతో ఆమె మృతదేహాన్నిబట్టల్లో చుట్టి, తన గ్రామానికి కాలినడకన కూతురితో సహా బయల్దేరాడు.

అలా అతడు 10 కిలోమీటర్లు నడిచి వెళ్లిన అనంతరం ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకొన్న జిల్లా కలెక్టర్ మిగతా 50 కిలోమీటర్లకు ఆంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్య పూరితం గా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

English summary
It's an image that will haunt India for many days. In one of the country's poorest districts in Odisha, a man walked 10 km with his wife's body on his shoulder, his weeping 12-year-old daughter by his side.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X