పన్నీర్ సెల్వం, స్టాలిన్ భేటి: ఆట మొదలైయ్యింది !
చెన్నై: డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన ఎంకే. స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో భేటీ కానున్నారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో సీఎం పన్నీర్ సెల్వంతో స్టాలిన్ భేటీ కానున్నారని డీఎంకే వర్గాలు తెలిపాయి.
సంక్రాంతి పండుగ సందర్బంగా తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా జల్లికట్టు సాహస క్రీడ జరిపిస్తారు. అయితే ఇప్పుడు జల్లికట్టు జరిపించడానికి సమస్యలు ఎదురైనాయి. సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉండటమే అందుకు కారణం.

జల్లికట్టు నిర్వహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డీఎంకే పార్టీతో సహ అన్ని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జల్లికట్టు విషయంలో రాజకీయం చేస్తున్నదని ఆరోపిస్తున్నారు.
ఈనేపథ్యంలో డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన స్టాలిన్ సీఎం పన్నీర్ సెల్వంను కలిసి జల్లికట్టు జరిపించడానికి ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చెయ్యనున్నారని డీఎంకే నాయకులు తెలిపారు. మొత్తం మీద సీఎం పన్నీర్ సెల్వం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ భేటీకి రంగం సిద్దం అయ్యింది.












Click it and Unblock the Notifications