బలవంతపు పెళ్లి చేస్తున్నారంటూ.. బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు..!
భోపాల్ : మధ్యప్రదేశ్ బీజేపీ నేత కుటుంబ వివాదంలో ఇరుక్కున్నారు. మాజీ ఎమ్మెల్యే సురేంద్ర నాథ్ సింగ్‌పై సొంత కూతురే ఆరోపణలు చేస్తుండటం చర్చానీయాంశమైంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసేందుకు తండ్రి ప్రయత్నిస్తున్నారని ఆమె ఇళ్లు విడిచి వెళ్లిపోయారు. ఓ పొలిటిషియన్ కొడుకుతో తనకు బలవంతపు పెళ్లి చేస్తున్నారనే కారణంతోనే అలా చేశానంటున్నారు ఆ యువతి.
ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంతో కుటుంబ సభ్యులను ధిక్కరించి హైకోర్టును ఆశ్రయించారు సురేంద్ర నాథ్ సింగ్ కూతురు. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రక్షణ కల్పించాలంటూ కోర్టును వేడుకున్నారు. ఆ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు.

ఈ నెల 16వ తేదీన సురేంద్ర నాథ్ సింగ్ పోలీసులను ఆశ్రయించారు. తన కూతురు భారతీ సింగ్ తప్పిపోయిందని కేసు ఫైల్ చేశారు. ఆమె మెంటల్లీ డిప్రెషన్‌లో ఉందని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. అయితే తండ్రి చేసిన ఫిర్యాదు తప్పని వాదిస్తున్నారు భారతీ సింగ్. తాను మానసికంగా చాలా ధృడంగా ఉన్నానని.. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పుకొచ్చారు. అయితే తనకు పిచ్చి ఎక్కిందంటూ ఫ్యామిలీ మెంబర్స్ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు తయారు చేశారని ఫైరయ్యారు.
భారతీ సింగ్ తరపు లాయర్ ఈ విషయంపై స్పందించారు. పుణేలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న భారతీ సింగ్‌ను ఇటీవల తల్లికి అనారోగ్యంగా ఉందంటూ లక్నోకు రప్పించారని.. ఆ క్రమంలో ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూడటంతో కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఇతర వ్యక్తితో ఆమె చనువుగా ఉంటోందనే కారణంతో కుటుంబ సభ్యులు ఆమెను వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని.. ఇంట్లో వేధింపులు ఎక్కువ కావడంతోనే న్యాయస్థానంకు వెళ్లినట్లు వెల్లడించారు.
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications