వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవరాత్రుల్లో అశ్లీల నృత్యాలు?: ఇరువర్గాల మధ్య దాడులు, కర్రలతో కొట్టుకున్నారు

|
Google Oneindia TeluguNews

భోపాల్: దసరా నవరాత్రుల సందర్భంగా ఇరువర్గాల మధ్య దాడులు చోటు చేసుకోవడంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆదివారం నాడు నవరాత్రి వేడుకల సందర్భంగా రెండు వర్గాల మధ్య లాఠీలతో పోట్లాట జరిగింది. ఆ తర్వాత ఈ దాడులు ఇతర ప్రాంతాలకు కూడా పాకాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని అగర్ జిల్లా కంకర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించినందుకు అగ్రవర్ణాల వారు తమపై దాడి చేశారని గ్రామంలోని దళిత సంఘాల సభ్యులు తెలిపారు.

 Madhya Pradesh: Intense Fight Over Navratri Celebration in Agar district

గర్బా ఫంక్షన్ కోసం ఇద్దరు అమ్మాయిలు చేసిన అశ్లీల నృత్యంపై వాదనతో గొడవ ప్రారంభమైందని మరో వర్గం వెల్లడించింది.

"ఒక పాట-నృత్య కార్యక్రమం గొడవకు దారితీసింది, అది గొడవకు దారితీసింది. మేము రెండు వైపుల నుంచి ఫిర్యాదులను నమోదు చేశాం. కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం, అని సీనియర్ పోలీసు అధికారి నవల్ సింగ్ సిసోడియా తెలిపారు.

'కర్రలతో దాడులు చేసుకున్నారు. మేము పరిశీలిస్తున్న వీడియోలు ఉన్నాయి. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం' అని సదరు అధికారి తెలిపారు.

English summary
Madhya Pradesh: Intense Fight Over Navratri Celebration in Agar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X