వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కూల్ లో టాయిలెట్లు శుభ్రం చేసిన మధ్యప్రదేశ్ మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్, ఫోటోలు వైరల్!!

|
Google Oneindia TeluguNews

మధ్య ప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్ ఓ పాఠశాలలో టాయిలెట్లు కడగడం ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. ఓ పాఠశాల కు సంబంధించిన విద్యార్థిని, పాఠశాల సిబ్బంది టాయిలెట్లు శుభ్రంగా ఉంచటం లేదని చేసిన ఫిర్యాదుతో పాఠశాలకు వెళ్లిన మంత్రి టాయిలెట్లు కడిగి అందరినీ షాక్ అయ్యేలా చేశారు. అక్కడ ఉన్న పాఠశాల సిబ్బంది సిగ్గుపడేలా చేశారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన పవన్.. సోషల్ మీడియాలో రచ్చ షురూ!!విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన పవన్.. సోషల్ మీడియాలో రచ్చ షురూ!!

 స్కూల్ టాయిలెట్లను మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్

స్కూల్ టాయిలెట్లను మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్

మధ్య ప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్ టాయిలెట్లను కడిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్వాలియర్ లోని ఒక పాఠశాలలో టాయిలెట్లు శుభ్రంగా ఉంచటం లేదంటూ ఓ బాలిక ఇటీవల ఏకంగా మంత్రికి ఫిర్యాదు చేసింది. దీంతో పాఠశాలకు వెళ్లిన మంత్రి పాఠశాల టాయిలెట్లను పరిశీలించారు. అత్యంత అశుభ్రంగా ఉన్న ఆ పాఠశాల టాయిలెట్లను మంత్రి తోమర్ స్వయంగా పైపుతో నీళ్లు పోస్తూ, చీపురుతో రుద్ది మరీ కడిగారు. తద్వారా పాఠశాలలోని టాయిలెట్లను శుభ్రంగా ఉంచండి సిబ్బందికి తమ తప్పు తెలిసేలా చేశారు మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్.

టాయిలెట్లు శుభ్రంగా లేవని విద్యార్థిని ఫిర్యాదు

టాయిలెట్లు శుభ్రంగా లేవని విద్యార్థిని ఫిర్యాదు

పాఠశాలలోని టాయిలెట్లను శుభ్రం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాఠశాలల్లోని టాయిలెట్లను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల తనకు ఒక విద్యార్థిని పాఠశాలలో టాయిలెట్లు శుభ్రంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అనారోగ్యం బారిన పడుతున్నామని ఫిర్యాదు చేసిందని, దీంతో తానే స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి శుభ్రంగా టాయిలెట్లను అడిగానని చెప్పారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తమ తమ విధులు నిర్వర్తించాలని మంత్రి తోమర్ హితవు పలికారు.

మంత్రి చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు.. కొందరు సెటైర్లు

మంత్రి చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు.. కొందరు సెటైర్లు

ఇక మంత్రి చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒక విద్యార్థిని ఫిర్యాదుతో స్వయంగా మంత్రి వెళ్లి టాయిలెట్లను శుభ్రం చేయడంపై పొగడ్తలు వర్షం కురిపిస్తున్న వారు కొందరైతే, ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది పని చేయడం లేదని, మంత్రులే వెళ్లి టాయిలెట్లు కడిగే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేస్తున్న వారు మరికొందరు. అ గతంలో కూడా గ్వాలియర్ నియోజకవర్గంలోని బిర్లా నగర్లో పరిశుభ్రత డ్రైవ్ చేపట్టిన మంత్రి, ఏకంగా మురికి కాలువ లోకి దిగి కాలువలు శుభ్రం చేశారట. అప్పట్లో మహిళా ఉద్యోగులు టాయిలెట్ లు అపరిశుభ్రంగా ఉన్నాయని ఫిర్యాదు చెయ్యటంతో మంత్రి రంగంలోకి దిగి వాటిని శుభ్రం చేశారు.

పరిశుభ్రత డ్రైవ్ పై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ

పరిశుభ్రత డ్రైవ్ పై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ

యితే ఇటువంటి పనులు చేయడంలో మంత్రి ఎప్పుడూ ముందు ఉంటానని స్థానికంగా చర్చ జరుగుతోంది.అంతకుముందు గ్వాలియర్ లోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఆయన టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయని శుభ్రం చేశారట. ఇక ఈ పనులే కాదు గతంలో హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి దాని పై ఉన్న చెత్తను కూడా శుభ్రం చేసారట సదరు మంత్రి. దీంతో ప్రస్తుతం మంత్రి గారి పరిశుభ్రత డ్రైవ్ పై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

English summary
Madhya Pradesh Minister Pradhuman Singh Tomar went to the school and cleaned more toilets after a student complained that the toilets in the school were not clean. Now those photos have gone viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X