వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషం కలిపిన చపాతీలు తిని జడ్జీ, అతని కుమారుడు మృతి: మహిళ, డ్రైవర్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

భోపాల్: విషం కలిపిన చపాతీలు తిని ఓ జిల్లా జడ్జీ, అతని కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇద్దరి మరణాలకు కారణమైన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కినెట్టారు.

చపాతీలు తిని తండ్రీకొడుకులు మృతి..

చపాతీలు తిని తండ్రీకొడుకులు మృతి..

బేతుల్ ఎస్పీ సిమలా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. బేతుల్ జిల్లా అడిషనల్ స్పెషల్ జడ్జీగా ఉన్న మహేంద్ర త్రిపాఠి, ఆయన కుమారుడు జులై 20వ తేదీన చపాతీలు తిన్న అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ రెండ్రోజుల క్రితం న్యాయమూర్తితోపాటు అతని కుమారుడు కూడా మరణించారు. గోధుమ పిండిలో విషం కలపడం వల్లే త్రిపాఠి, అతని కుమారుడు మరణించినట్లు ధృవీకరించారు.

గతంలో సంధ్యా సింగ్‌తో జడ్జీకి పరిచయం

గతంలో సంధ్యా సింగ్‌తో జడ్జీకి పరిచయం

సంధ్యా సింగ్ అనే మహిళ ఈ విష ప్రయోగానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, చింద్వారాకు చెందిన 45 ఏళ్ల సంధ్యా సింగ్ ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది. కొంత కాలం క్రితం న్యాయమూర్తి కూడా అక్కడే పనిచేయడంతో వారి మధ్య పరిచయం ఏర్పడింది.

ప్రత్యేక పూజంటూ...

ప్రత్యేక పూజంటూ...


ఆ తర్వాత న్యాయమూర్తి బేతుల్‌కు బదిలీ అయ్యారు. అనంతరం ఆయన భార్యా పిల్లలు కూడా అతని దగ్గరకు వచ్చారు. దీంతో సంధ్యా సింగ్‌కు గత 4 నెలలుగా మహేంద్ర సింగ్‌ను కలవడం సాధ్యంకాలేదు. ఈ క్రమంలో న్యాయమూర్తి కుటుంబం కోపం పెంచుకున్న సంధ్యాసింగ్.. ఆ కుటుంబాన్ని అంతం చేయాలని కుట్రపన్నింది. మీ కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగించేందుకు ఓ ప్రత్యేక పూజ చేయిస్తానని న్యాయమూర్తిని సంధ్యా సింగ్ నమ్మించింది.

Recommended Video

Sonu Sood Has The Best Solution’ As Woman Complains About Her Husband
చపాతీ విషయం బయటపడటంతో..

చపాతీ విషయం బయటపడటంతో..


గోధుమ పిండితో పూజ చేసిన ఆమె.. ఆ పిండిలో విషం కలిపి చపాతీలను చేసింది. ఆ చపాతీలను ఒకరోజు తర్వాత న్యాయమూర్తికి ఇచ్చింది. ఆ రోజు రాత్రి మహేంద్ర త్రిపాఠి, అతని కుమారుడు ఆ చపాతీలు తినడంతో అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత మరణించారు. అయితే, త్రిపాఠి భార్య మాత్రం చపాతీలు తినకపోవడంతో పెనుగండం నుంచి బయటపడింది. ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో గోధుమ పిండి విషయాన్ని అతని చిన్నకుమారుడికి త్రిపాఠి చెప్పడంతో ఈ మరణాలు మిస్టరీ వీడింది. దర్యాప్తు జరిపిన పోలీసులు.. సూత్రధారి అయిన సంధ్యా సింగ్ తోపాటు ఆమెకు సహకరించిన ఓ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

English summary
Six people including a woman were booked for the murder of an additional district and sessions judge and his son in Betul district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X