నిషేధం: రిక్షాలు తొక్కుతున్న ‘మ్యాగీ’ కార్మికులు
న్యూఢిల్లీ: మ్యాగీ వివాదం అనంతరం ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో నెస్లే కంపెనీకి చెందిన ఉద్యోగులు, కార్మికులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నెస్లే కంపెనీకి చెందిన రుద్రపూర్ ప్లాంట్‌లో పనిచేసే కార్మికులందరు ఉద్యోగాలు కోల్పోయారు.
ఉన్నపళాన నిరుద్యోగులైన దాదాపు 1,100మంది కార్మికులు ప్రస్తుతం రిక్షాలు లాగుతూ జీవితం గడుపుతున్నారు. మ్యాగీపై నిషేధం విధించక ముందు రుద్రపూర్ ప్లాంట్‌లో రోజుకు మూడు టన్నుల మ్యాగీని ఉత్పత్తి చేసేవారు.

ప్రస్తుతం మ్యాగీపై నిషేధం నడుస్తుండటంతో కార్మికులందరికీ పనిలేకుండా పోయింది. దీంతో వారంతా వివిధ రకాల పనులు చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ పనిచేసే కార్మికులలో పక్క రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు.
దీంతో వాళ్లు తిరిగి స్వరాష్ట్రానికి వెళ్లిపోతున్నారు. ఇటీవల బాంబే హైకోర్టు మ్యాగీపై నిషేధాన్ని ఎత్తివేయడంతో కార్మికులలో మళ్లీ ఆశలు రేకెత్తుతున్నాయని స్థానిక అధికారులు చెబుతున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications