Bihar Election: బీహార్ లో మా సీఎం, డీసీఎంలు వీళ్లే-తేల్చేసిన మహాకూటమి..!
వచ్చే నెలలో రెండు దశల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో దూసుకెళ్తున్న మహాకూటమి సీట్ల పంపకాల విషయంలో మాత్రం విమర్శలు ఎదుర్కొంది. ఈసారి మహాకూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న అంచనాలతో భాగస్వామ్య పార్టీల మధ్య పోటీ పెరగడంతో స్నేహపూర్వక పోటీలకు కూడా సిద్దమైంది. దీంతో కూటమిలో కుమ్ములాటల్ని సొమ్ము చేసుకోవాలన్న అధికార ఎన్డీయేకు ఇవాళ షాక్ తగిలింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్ధుల్ని సైతం మహాకూటమి ప్రకటించింది. సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, డిప్యూటీ సీఎంగా వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ నేత ముకేష్ సహానీని ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత అశోక్ గెహ్లాట్ పాట్నాలో స్పష్టమైన ప్రకటన చేశారు. అంతే కాదు ఎన్డీయే తరఫున ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో ప్రకటించాలని బీజేపీ-జేడీయూకు సవాల్ కూడా విసిరారు. మహాకూటమి గెలిస్తే ఒకరి కంటే ఎక్కువ డిప్యూటీ సీఎంలు ఉంటారని వెల్లడించారు.

తనని బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా మహా కూటమి ఎంపిక చేయడం పట్ల తేజస్వీ యాదవ్ భాగస్వామ్య పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. బీహార్‌ను పునర్నిర్మించడానికి మహాకూటమి కలిసి పనిచేస్తుందన్నారు. నితీష్ కుమార్ అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారని, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్ది అని ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా రాలేదని గుర్తుచేశారు. ప్రతి ఎన్నికలకు ముందు నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించేవారని, ఈసారి అలా ఎందుకు చేయలేదని అమిత్ షాను తేజస్వీ ప్రశ్నించారు. ఇది నితీష్ కుమార్ చివరి ఎన్నికని అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారన్నారు.

#WATCH | Former Bihar Deputy CM and RJD leader Tejashwi Yadav announced as Mahagathbandhan's CM face for #BiharAssemblyElections
— ANI (@ANI) October 23, 2025
Senior Congress leader Ashok Gehlot says, "...All of us sitting here have decided that in these elections, we support Tejashwi Yadav as the CM… pic.twitter.com/ghAi0tSDMm
బీహార్ లో మహా కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి కాక ముందు తేజస్వీ యాదవ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే తమ డిమాండ్లు నెరవేరవని భావించిన కాంగ్రెస్..ఇప్పటివరకూ దీనిపై మౌనంగా ఉంది. సీట్ల పంపకాలు తేలిపోవడంతో ఇప్పుడు తేజస్వీని ముఖ్యమంత్రి అభ్యర్దిగా అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు కూటమిలో విభేదాలు కూడా సమసిపోయినట్లు వెల్లడించింది. ఆర్జేడీతో పాటు చిన్న పార్టీల్ని కలుపుకుని ఈసారి బీహార్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications