మహాన్ బెంగళూరు సంస్థాన్, ఐటీ హబ్ కు దిక్కులేనన్ని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ !

బెంగళూరు: ఐటీ హబ్ గా పప్రంచ దేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు నగరం రూపురేఖలు మార్చేస్తామని, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 'మహాన్ బెంగళూరు సంస్థాన్ ' పేరుతో బెంగళూరు ప్రజల సమ్యలు అన్ని పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో దిక్కులేనన్ని హామీలు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల ఒకవైపు అయితే, మరో వైపు బెంగళూరులోని అసెంబ్లీ నియోజక వర్గాల మీద బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల కన్నుపడింది. బెంగళూరు సిటీలో పట్టుసాధించాలని, బెంగళూరులో పట్టు ఉంటే చాలని బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ముందు నుంచిపోటీపడుతున్నాయి.

Congress party that has given so many promises to the people of Bengaluru.

బెంగళూరులో సమస్యలు పరిష్కరించడానికి ఇంత వరకు ఏ పార్టీ కూడా చిత్తశుద్దితో పని చెయ్యలేదని అపవాదులు ఉన్నాయి, బెంగళూరు నిత్యం వేధిస్తున్న సమస్యల్లో ప్రధానమైనది చెత్త సమస్య, తరువాత ట్రాఫిక్, తాగునీటి సమస్య, కరెంట్ సరఫరా, సక్రమంగా లేని డ్రైనేజ్ లతో ప్రజలకు లేనిపోని ఇబ్బందులు ఇలా చాలానే ఉన్నాయి.

మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బెంగళూరులో చెత్తకు శాస్వత పరిష్కారం చూపిస్తామని, డ్రైనేజ్ లు ఏర్పాటు చేస్తామని, ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి బెంగళూరు నగరంలోని నలుమూల్లో ఫ్లైఓవర్లు నిర్మిస్తామని, తాగునీటి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తామని, రోడ్లు బాగుచేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెట్రో పనులు ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. బీబీఎంపీ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించడానికి, బెంగళూరులోని సమస్యలు వెంటనే పరిష్కరించడానికి ఓ చట్టం తయారు చేస్తామని, తాగునీటి సమస్య, విద్యుత్, రోడ్ల మరమత్తులు, చెత్త నిర్మూలణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం మొత్తం ఒకే తాటిమీదకు తీసుకొచ్చి వాటి సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

మహాన్ బెంగళూరు సంస్థాన్ పేరుతో బెంగళూరుకు పూర్వవైభవం తీసుకువస్తామని, బెంగళూరులో మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని ఎవ్వరూ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా బెంగళూరు ప్రజలకు సేవ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వరాలజల్లు కురిపించింది.

బెంగళూరులోని పారిశ్రామివేత్తలు, వ్యాపారులు, నిపుణులు, ఆర్థిక సలహాదారులతో ప్రత్యేకంగా కమిటీలు వేసి అన్ని ప్రాంతాల్లోని సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. తుమకూరులోని వసంత నరసాపుర వరకు మెట్రో రైలు విస్తరిస్తామని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+