మార్చి 24 వరకు మహాపంచాయతీలు .. కేంద్రానివి రైతు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు : రాకేశ్ టికాయత్
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల పై రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. మార్చి 24 వరకు దేశంలోని పలు చోట్ల రైతుల "మహాపాంచాయతీలు" జరుగుతాయని రాకేష్ టికాయత్ తెలిపారు . రైతులు ఆందోళన కు వ్యతిరేకంగా కొన్ని చర్యలు తీసుకున్నట్లుగా గత కొద్ది రోజులుగా కేంద్రం యొక్క నిశ్శబ్దం సూచిస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు.

రైతుల అణచివేతకు కేంద్రం కుట్రలు
ఆదివారం రాత్రి ఉత్తరాఖండ్‌లోని ఉధామ్ సింగ్ నగర్ బయలుదేరే ముందు, భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నాయకుడు బిజ్నోర్ అఫ్జల్ గంజ్ లో విలేకరులతో మాట్లాడుతూ, గత 15-20 రోజులుగా ప్రభుత్వ నిశ్శబ్దం ఏదో జరగబోతోందని సూచిస్తుందన్నారు . నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో తిరిగి చర్చలు జరపడానికి ప్రభుత్వం ప్రతిపాదనతో ముందుకు రావాల్సి ఉందని ఆయన నొక్కి చెప్పారు. ప్రభుత్వం రైతులు నిరసనను అణచివేయడానికి ఏదో కొత్త ప్రణాళిక వేస్తోందని, ఆందోళనకు వ్యతిరేకంగా చర్యలకి సిద్ధమవుతుందని అనుమానం వ్యక్తం చేశారు.

మార్చి 24 వరకు కొనసాగనున్న మహా పంచాయతీలు
వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు, రైతుల సమస్యలకు పరిష్కారం లభించే వరకు రైతులు వెనక్కి తగ్గరని టికాయత్ చెప్పారు. రైతులు ఆందోళన కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారని, రైతులు తమ వ్యవసాయంతో పాటు ఆందోళనలు కూడా కొనసాగిస్తున్నారని పేర్కొన్న టికాయత్ సమయం వచ్చినప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు
. మార్చి 24 వరకు దేశంలోని పలు చోట్ల రైతుల "మహాపంచాయతీలు" జరుగుతాయని రాకేష్ టికాయత్ తెలిపారు .

మూడు నెలలకు పైగా ఆందోళన చేస్తున్నా పట్టని సర్కార్
న్యూ ఢిల్లీలో రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా జరిగిన హింస సమయంలో ప్రభుత్వం ఇబ్బందులను సృష్టించిందని ఆరోపించారు. కావాలని రైతు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిందని అన్నారు. మూడు నెలలకు పైగా ఆందోళన కొనసాగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు . కేంద్రం అడుగడుగునా కుట్రలకు తెర తీస్తుందని టికాయత్ చెప్పారు .

ఉత్తరప్రదేశ్‌లో గోధుమకు కనీస మద్దతు ధర ఇవ్వకుంటే ఉధృతంగా ఆందోళన
రైతులు వేర్వేరు ప్రదేశాలలో తమ పంటను నాశనం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని నిర్ణయంపై మాట్లాడుతూ, అటువంటి పంటను నాశనం చేసే చర్యకు సమయం ఇంకా రాలేదని బికెయు నేత చెప్పారు. అయితే ప్రభుత్వం అలాంటి చర్య తీసుకోకూడదని రైతులను ఎందుకు విజ్ఞప్తి చేయడం లేదో చెప్పాలని ఆయన అడిగారు. ఉత్తరప్రదేశ్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) పై గోధుమ పంటను విక్రయించకపోతే రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేస్తారని, వారు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ప్రధాన కార్యాలయం వెలుపల ధర్నాలు నిర్వహిస్తారని టికాయత్ వెల్లడించారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications