Train Ticket: ఆ రైలు టికెట్ ధర రూ.19 లక్షలు.. ఎక్కడో కాదు మనదేశంలోనే..
భారత్ లో అతి చౌకైన ప్రయాణం ఏది అంటే రైలు ప్రయాణం అని ఇట్టే చెప్పేస్తారు. ఎందుకంటే రైలు టికెట్ చాలా చౌక కాబట్టి. అందుకే సుదూరప్రాంతాలకు వెళ్లే చాలామంది ప్రజలు బస్సుల కంటే రైళ్లలో వెళ్లేందుకు మొగ్గుచూతారు. దీనికి ప్రధాన కారణం రైలు టికెట్ తక్కువ.. పైగా తక్కువ ధరకు స్లీపర్ క్లాస్ బెర్త్ బుక్ చేసుకుని హాయిగా పడుకుని హాయిగా వెళ్లిపోవచ్చు.

బస్సు
అదే బస్సులో అయితే టికెట్ రేటు ఎక్కువ ఉండడంతో పాటు కంఫర్ట్ గా ఉండదు. అయితే రైలులో కూడా ఖరీదైన ప్రయాణాలు చెయ్యొచ్చు. ఖరీదైన ప్రయాణం మంటే.. ఈ ప్రయాణ టికెట్ విమాన టికెట్ కంటే ఎక్కువగా ఉంటుంది. విమాన టికెట్ ధర కంటే ఎక్కువ అంటే రూ. 6వేలో రూ.8 వేలో అనుకుంటే పొరపాటే.. ఆ ట్రైన్ టికెట్ ఖరీదు అక్షరాల రూ.19 లక్షల పైమాటే..

2010
అవును మీరు విన్నది నిజమే.. ఇంతకీ అది ఏ రైలు అంటున్నారా.. అదే మహారాజ్ ఎక్స్‌ప్రెస్. ఈ రైలులో మీకు ఫైవ్ స్టార్ స్టైల్ లో సర్వీస్ ఉంటుంది. మీరు ఈ ట్రైన్ లో వెళ్తే ఇదీ ట్రైనా లేక హోటలా అని అనిపిస్తుంది. ఈ రైలును భారత రైల్వే శాఖ 2010 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. అత్యంత సంపన్నులు ఈ రైలులో బుక్ చేసుకునే గదులను నవరత్న అని పిలుస్తారు.
దుబాయి
అయితే ఈ రూ.19 లక్షలతో విమానంలో దుబాయికి 19 సార్లు వెళ్లిరావొచ్చట. ఈ ట్రైన్ గురించి ఇప్పుడెందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా.. రైలుకు సంబంధంచి ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications