Maharashtra bandh: ప్రభుత్వమే బరిలో దిగితే.. రిజల్ట్ ఇట్లనే ఉంటది
ముంబై: కొద్దిరోజుల కిందట ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించిన రైతులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు జీపును పోనిచ్చిన ఘటన.. మొత్తంగా ఎనిమిది మంది మరణానికి కారణమైంది. తొలుత నలుగురు రైతులు దుర్మరణం పాలయ్యారు. ఆ తరువాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో మరో నలుగురు మృతి చెందారు.

ఉత్తర ప్రదేశ్ హీట్..
మృతుల కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నాయకులను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్బంధించడం అక్కడి వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ప్రియాంకా గాంధీ వాద్రా ఏకంగా నిరహార దీక్షకు దిగారు. ఆ తరువాత లఖింపూర్ ఖేరి హింసాత్మక పరిస్థితుల బాధిత కుటుంబాలను పరామర్శించడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. కాంగ్రెస్ నేతలు పరిమితంగా అనుమతి ఇవ్వడంతో తాత్కాలికంగా ఆ రాజకీయ రచ్చ సద్దుమణిగింది.

రాష్ట్రపతి అపాయింట్‌మెంట్..
రైతులపై నిర్దాక్షిణ్యంగా జీపును పోనిచ్చారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్న కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఆయన కుమారుడు ఆశీష్ మిశ్రాపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలను తీసుకోవడానికి వెనుకాడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. దీనికోసం ఆయన అనుమతి కోరారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా మొత్తం ఏడుమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్రపతిని కలుసుకోవడానికి అనుమతి కోరారు.

రైతు కుటుంబాలకు మద్దతుగా..
లఖింపూర్ ఖేరి ఘటనలో ప్రాణాలను కోల్పోయిన రైతు కుటుంబాలకు మద్దతుగా, వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతోన్న బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ తెల్లవారు జామున బంద్ ఆరంభమైంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సారథ్యంలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి ఈ బంద్‌ను చేపట్టింది. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ బంద్‌కు మద్దతు ఇచ్చాయి.

స్తంభించిన మహారాష్ట్ర..
ఏకంగా ప్రభుత్వమే బంద్‌కు పిలుపునివ్వడంతో.. దీని ప్రభావం కనిపిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా అన్ని నగరాలు స్తంభించిపోయాయి. వాహనాలేవీ రోడ్డెక్కలేదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలేవీ తెరచుకోలేదు. నిత్యం లక్షలాది వాహనాలతో క్రిక్కిరిసి పోయి కనిపించే ముంబై రహదారులన్నీ బోసి పోయాయి. ముంబై, నవీ ముంబై, నాసిక్, పుణె, థానె, నాగ్‌పూర్, ఔరంగాబాద్, షోలాపూర్, కొల్హాపూర్, నాందెడ్, సాంగ్లీ, జల్‌గావ్, అకోలా, వార్ధా, ధులె, పర్భణీ.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ బంద్ ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది.

రిటైల్ ట్రేడర్స్.. మార్కెట్ కమిటీ బంద్‌లో
అత్యవసర సర్వీసులు, నిత్యావసర సరుకుల రవాణాను బంద్ నుంచి మినహాయించారు. రాష్ట్రవ్యాప్త బంద్‌కు వ్యాపార సంఘాలు, పారిశ్రామిక అసోసియేషన్లు కూడా మద్దతు పలికాయి. స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటామని మహారాష్ట్ర రిటైల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీలు, అనుబంధ సంఘాలు బంద్‌లో సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఫలితంగా దుకాణాలు గానీ, వ్యవసాయ మార్కెట్లు గానీ తెరచుకోలేదు.

కేంద్రమంత్రి బర్తరఫ్ కోసం
వాహనాలేవీ రోడ్డెక్కలేదు. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. బంద్‌లో భాగంగా మహా వికాస్ అఘాడి కూటమి నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. డిపోల వద్ద బైఠాయించారు. గేట్ మీటింగులకు నిర్వహించనున్నారు. కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రాను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్ సర్కార్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Recommended Video

బీజేపీ దూరం..
ఈ బంద్‌కు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంటోంది. అధికార కూటమి బలవంతంగా బంద్‌ను ప్రజలపై రుద్దుతోందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి నారాయణ్ రాణె విమర్శించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ప్రజలెవరూ బంద్‌లో పాల్గొనడానికి సుముఖంగా లేరని, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కార్యకర్తలు బలవంతంగా దుకాణాలను మూసివేయిస్తున్నారని ఆరోపించారు. ఈ బంద్ విఫలమైందని తేల్చి చెప్పారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications