మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో .. పాటలతో,కామెడీతో అదరగొట్టిన బీజేపీ నేత బాబు మోహన్
మహారాష్ట్ర లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బిజెపి నేత, ప్రముఖ కమెడియన్ బాబు మోహన్ పాల్గొంటున్నారు. అక్కడ కార్యకర్తలను పార్టీ శ్రేణులను ఉత్సాహ పరచడమే కాకుండా, ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తున్నారు. అంతేకాదు పాటలు పాడుతూ అక్కడి ప్రజల్లో జోష్ పెంచుతున్నారు.
మహారాష్ట్రలోని షోలాపూర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రముఖ కమెడియన్, తెలంగాణ బిజెపి నేత బాబు మోహన్ పాల్గొన్నారు. 60 శాతం తెలుగు ప్రజలు ఉన్న ఈ నియోజకవర్గంలో ఆయన తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. బిజెపి తరఫున ప్రచారాన్ని సాగించారు. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో అంటూ పాట పాడి రెండు స్టెప్పులేశారు. దాదాపు పాత అసగానికి పైగా పాడిన ఆయనతనపాటల గురించి తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు.
బావలు సయ్యా అంటూ నాటి రోజులు గుర్తు చేశారు.ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన ఓటర్లను కోరారు. అంతేకాదు సినిమాలోని కామెడీ డైలాగులు చెబుతూ అందరినీ ఎంటర్టైన్ చేశారు సినీ నటుడు, బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్.

మహారాష్ట్ర అభివృద్ధి జరగాలంటే బిజెపికి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించిన ఆయన తనదైన స్టైల్లో కామెడీ డైలాగ్ లతో నే ఓట్లు వేయాలని కోరారు. సరైన నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే మరో ఐదేళ్ల వరకు నోరు తెరుచుకుని ఎదురు చూడాల్సి వస్తుందని పేర్కొన్న ఆయన ఓటర్ల తీర్పు బిజెపికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత నియోజకవర్గానికి వచ్చి అందరితో కలిసి డాన్స్ చేస్తానని ఆయన మాటిచ్చారు. బాబు మోహన్ ప్రసంగం సమయంలో అక్కడికి వచ్చిన ప్రజలు ఆయన చేసిన ఎంటర్టైన్మెంట్ కు చప్పట్లు కొట్టారు. మరి బాబు మోహన్ ఎన్నికల ప్రచారం బిజెపికి లభిస్తుందో లేదో మరి కొద్దిరోజుల్లోనే తేలనుంది.












Click it and Unblock the Notifications