మహారాష్ట్రలోని సతారాలో పేలుడు... ముగ్గురు మృతి
ముంబై: మహారాష్ట్రలోని సతారాలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు మరణించారు. ఆరుగురి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

నిర్మాణంలో ఉన్న భవనం వద్ద గోడౌన్‌లో ఉంచిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న స్ధానిక పోలీసులు అక్కడి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాద ఘటనకు టెర్రరిస్టులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు.
అస్సాంలో ఏడుగురు బోడో ఉగ్రవాదులు అరెస్టు
బోడోలాండ్‌లోని నేషనల్ డెమొక్రటిక్ ఫ్రండ్‌కు చెందిన ఏడుగురు ఉగ్రవాదులను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు గత ఏడాది డిసెంబర్‌లో కొక్రాఘర్‌లో దళితుల ప్రాణాలు బలిగొన్నవారిగా పోలీసులు భావిస్తున్నారు.
అస్సాం పోలీసులు, ఆర్మీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో వీరిని అరెస్టు చేశారు. ఏడుగురు తీవ్రవాదుల వద్ద నుంచి పోలీసులు 10 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రిజర్వు అటవీ ప్రాంతంలో 4 ఏకే-47లతోపాటు ఒక హెచ్‌కే-33, ఎం-16 యుఎస్, ఇన్‌సాస్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications