సెంట్రల్ జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారీ, రైల్వే, బస్టాండ్లలో నిఘా
ముంబై: మహారాష్ట్రలోని నాగపూర్ సెంట్రల్ కారాగారం నుంచి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. ఈ తెల్లవారుజామున రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య ఐదుగురు ఖైదీలు పారిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
పారిపోయిన ముగ్గురిలో మహారాష్ట్ర కంట్రోల్ ఆప్ ఆర్గజైజ్‌డ్ క్రైమ్ చట్టం కింద అరెస్టు చేయగా, మిగిలిన ఇద్దరినీ అక్రమాయుధాల కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పారిపోయిన వారిని మధ్య ప్రదేశ్‌కు చెందిన బిషన్ సింగ్, సత్యేంద్ర గుప్త, మహ్మద్ సాలెబ్ సలీంగా గుర్తించామని అన్నారు.

మిగిలిన ఇద్దరిలో నేపాల్‌కు చెందిన ప్రేమ్ నేపాల్‌ను అక్రమాయుధాల కేసులో అరెస్టు చేయగా, ఆశోక్ గోలును దొంగతనం కేసులో అరెస్టు చేసినట్లు తెలిపారు. తప్పించుకున్న వారికోసం రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, ప్రైవేట్ బస్టాండ్లలో నిఘా పెట్టినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications