వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా సంక్షోభం: లగ్జరీ హోటల్‌లో రెబల్ ఎమ్మెల్యేలు, రోజుకు లక్షల్లో ఖర్చు, పవార్ ఏమన్నారంటే?

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే తన వద్ద 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం మరికొంత మంది ఎమ్మెల్యేలు షిండే శిబిరానికి చేరుకున్నట్లు సమాచారం. వీరంతా అస్సాంలోని లగ్జరీ హోటల్‌లో బస చేస్తున్నారు.

రాడిసన్ బ్లూ లగ్జరీ హోటల్‌లో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు

రాడిసన్ బ్లూ లగ్జరీ హోటల్‌లో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు

అస్సాం రాజధాని గౌహతి శివార్లలో 37వ జాతీయ రహదారిపై ఉన్న రాడిసన్ బ్లూ లగ్జరీ హోటల్‌లో ఏక్‌నాథ్ షిండే, ఎమ్మెల్యేల బృందం క్యాంప్‌లు వేశారు. షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం గుజరాత్‌లోని సూరత్ నుంచి లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి మూడు అసోం స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లగ్జరీ బస్సుల్లో ఎమ్మెల్యేలను పోలీసులతో కలిసి రాడిసన్ బ్లూ హోటల్‌కు తరలించారు.

రెబల్ శివసేన ఎమ్మెల్యేల హోటల్ ఖర్చు రోజుకు లక్షల్లోనే

రెబల్ శివసేన ఎమ్మెల్యేల హోటల్ ఖర్చు రోజుకు లక్షల్లోనే

కాగా, రాడిసన్ బ్లూ లగ్జరీ హోటల్‌లో ఏడు రోజులకు రూ. 56 లక్షలకు డెబ్బై గదులు బుక్ చేయబడ్డాయని IANS నివేదించింది. హోటల్‌లో విస్తృతమైన ఈవెంట్ స్థలం, అవుట్‌డోర్ పూల్, స్పా, ఐదు రెస్టారెంట్లు ఉన్నాయి. ఆహారం, ఇతర సేవలకు రోజువారీ ఖర్చు దాదాపు రూ. 8 లక్షలు, మొత్తం ఏడు రోజుల ఖర్చు రూ. 1.12 కోట్లకు చేరుకుందని ఐఏఎన్ఎస్ వర్గాలు నివేదించాయి.

ఏక్‌నాథ్ షిండే శిబిరంలో ఉన్న 42 మంది ఎమ్మెల్యేలు వీరే

ఏక్‌నాథ్ షిండే శిబిరంలో ఉన్న 42 మంది ఎమ్మెల్యేలు వీరే

రాడిసన్ బ్లూ గౌహతిలో హాజరైన శివసేన ఎమ్మెల్యేలలో మహేంద్ర మూర్, భరత్ గోగోవాల్ లతపాటు ఏబీపీ న్యూస్ వర్గాల సమాచారం ప్రకారం, రాడిసన్ బ్లూ గౌహతిలో ఉన్న శివసేన ఎమ్మెల్యేలు:

1. మహేంద్ర మోర్రే
2. భరత్ గోగావాల్
3. మహేంద్ర దాల్వీ
4. అనిల్ బాబర్
5. మహేష్ షిండే
6. షాహాజీ పాటిల్
7. శంభురాజే దేశాయ్
8. దయారాజ్ చౌగులే
9. రమేష్ బోర్నారే
10. తానాజీ సావంత్
11. సందీపన్ బుమ్రే
12. అబ్దుల్ సత్తార్
13. ప్రకాష్ సర్వే
14. బాలాజీ కళ్యాణ్కర్
15. సంజయ్ శిర్సత్
16. ప్రదీప్ జైస్వాల్
17. సంజయ్ రాయ్ముల్కర్
18. సంజయ్ గైక్వాడ్
19. ఏకనాథ్ షిండే
20. విశ్వనాథ్ భోయిర్
21. శాంతారామ్ మోర్
22. శ్రీనివాస్ వంగ
23. ప్రకాష్ అభిత్కర్
24. చిమన్‌రావ్ పాటిల్
25. సుహాస్ కాండే
26. కిశోరప్ప పాటిల్
27. పర్తాప్ సర్నాయక్
28. యామినీ జాదవ్
29. లతా సోనవానే
30. బాలాజీ కినికర్
31. గులాబ్రావ్ పాటిల్
32. యోగేష్ కదం
33. సదా సర్వాంకర్
34. దీపక్ కేసర్కర్
35. మంగేష్ కుడాల్కర్

విలాసవంతమైన హోటల్‌లో ఉన్న స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇతర తిరుగుబాటుదారులు:

1. రాజ్ కుమార్ పటేల్, ప్రహార్ సంఘటన్
2. బచ్చు కాడు, ప్రహార్ సంఘటన
3. నరేంద్ర భోండేకర్ (స్వతంత్ర)
4. రాజేంద్ర పాటిల్ యాదవ్కర్ (స్వతంత్ర)
5. చంద్రకాంత్ పాటిల్ (స్వతంత్ర)
6. మంజుల గావిట్(స్వతంత్ర)
7. ఆశిష్ జైస్వాల్ (స్వతంత్ర)

శక్తివంతమైన జాతీయ పార్టీ మద్దతుంది: ఏక్‌నాథ్ షిండే

శక్తివంతమైన జాతీయ పార్టీ మద్దతుంది: ఏక్‌నాథ్ షిండే

తమకు అత్యంత శక్తివంతమైన జాతీయ పార్టీ మద్దుతు ఉందని శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే తెలిపారు. ఆయన ఆ పార్టీ పేరు చెప్పనప్పటికీ అది బీజేపీనేనని వార్తలు వినిపిస్తున్నాయి. తమ వద్ద 42 మంది ఎమ్మెల్యేలున్నారని చెప్పారు షిండే. అంతేగాక, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కాకుండా.. బీజేపీతో మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. తాము శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను వ్యతిరేకించడం లేదన్నారు. అయితే, బీజేపీతో కలిసి వెళ్లాలని కోరుతున్నామన్నారు.

అసెంబ్లీ ఫ్లోర్ టెస్టులోనే మెజార్టీ తేలుతుందన్న శరద్ పవార్

అసెంబ్లీ ఫ్లోర్ టెస్టులోనే మెజార్టీ తేలుతుందన్న శరద్ పవార్

మరోవైపు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఎవరికి మెజారిటీ ఉందో ఫ్లోర్ టెస్ట్ నిర్ణయిస్తుందని శరద్ పవార్ గురువారం అన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లేదా ఎంవీఏ, శివసేన మిత్రపక్షంగా ఉన్న పవార్ ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. "ఎవరికి మెజారిటీ ఉందో ఫ్లోర్ టెస్ట్ నిర్ణయిస్తుంది" అని అన్నారు. "మహారాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో ఉంది లేదా విధానసభలో ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. విధివిధానాలు అనుసరించినప్పుడు, ఈ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని రుజువు అవుతుంది' అని పవార్ అన్నారు.

English summary
Maharashtra: Floor Test Will Decide Fate Of MVA Govt, Says Sharad Pawar; Rebel MLAs Camping In Guwahati Luxury Hotel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X