వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర నేతలతో చర్చించిన తరువాతనే : శివసేన లాంటి పార్టీలతో పొత్తు..సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో శివసేన కు మద్దతిచ్చే అంశం పైన కాంగ్రెస్ అధినాయకత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేవమైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. దీంతో.. మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేతలను రావాలంటూ పార్టీ అధినేత్రి సోనియా ఆదేశించారు. సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి సమావేశమైన తరువాత శివసేనకు పొత్తు విషయంలో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సూచనలకు సోనియా ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి నెలకొంది. అయితే, కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని..అయితే శివసేన లాంటి పార్టీలతో కాంగ్రెస్ ఎప్పుడూ కలిసి పని చేయలేదని..ఆ రెండు పార్టీల మధ్య ఉన్న విభేదాలే మహారాష్ట్రలో సంక్షోభానికి కారణమని సీనియర్ నేత పల్లంరాజు వ్యాఖ్యానించారు. దీంతో..ఇప్పుడు కాంగ్రెస్ తుది నిర్ణయం పైన సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

 మహారాష్ట్రలో చేతులెత్తేసిన బీజేపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోం, గవర్నర్‌తో బీజేపీ నేతలు మహారాష్ట్రలో చేతులెత్తేసిన బీజేపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోం, గవర్నర్‌తో బీజేపీ నేతలు

మహారాష్ట్ర నేతలతో చర్చించిన తరువాతనే..

మహారాష్ట్ర నేతలతో చర్చించిన తరువాతనే..

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మహారాష్ట్రలో నెలకొన్ని రాజకీయ పరిస్థితుల పైన చర్చించారు. శివసేన..ఎన్సీపీ..కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశం పైన నిర్ణయానికి రాలేదు. దీని పైన ఎన్సీపీ నుండి ఒత్తిడి ఉన్నా.. సిద్దాంతాల రీత్యా విభేదించే పార్టీతో కలిసి పని చేయటం ద్వారా భవిష్యత్ లో ఏర్పడే ప్రభావం పైన సమావేశంలో చర్చించారు. అయితే, ఎన్సీపీ ప్రభుత్వంలో చేరినా..బయట నుండి మద్దతిచ్చే అంశం పైన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్లతో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకోవాలని సోనియా డిసైడ్ అయ్యారు. దీంతో.. మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్.. ప్రుధ్వీరాజ్ చౌహాన్..సుశీల్ కుమార్ షిండే..మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బాలా సాహెచ్ త్రోట్..సీఎల్నీ నేత పడావిని ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించారు. వారితో చర్చించి. .స్థానికంగా ఎదురయ్యే రాజకీయ అనుకూల..ప్రతికూలతల ఆధారంగా నిర్ణయం తుది నిర్ణయం తీసుకోనున్నారు.

శివసేన లాంటి పార్టీలతో కలవలేదు..

శివసేన లాంటి పార్టీలతో కలవలేదు..

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శివసేనకు మద్దతిచ్చే అంశం పైన సమావేశం అవ్వటంతో దీని పైన కాంగ్రెస్ సీనియర్లు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైట్ వింగ్ పార్టీ అయిన శివసేన లాంటి వారికి ఎప్పుడూ మద్దతుగా నిలవలేదని..అయితే పార్టీ వర్కింగ్ కమిటీ తీసుకునే నిర్ణయం ఫైనల్ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత పల్లంరాజు వ్యాఖ్యానించారు. శివసేన..బీజేపీ మధ్య అంతర్గత సమస్యల కారణంగానే మహారాష్ట్రలో రాజకీయంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. సాయంత్రం మరోసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది. ఇప్పటికే శివసేన చీఫ్ థాక్రే నేరుగా ఎన్సీపీ అధినేత శదర్ పవార్ తో మంతనాలు సాగించారు. ప్రభుత్వ ఏర్పాటులో ఒప్పందాల పైన వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పవార్ ద్వారా కాంగ్రెస్ ను సైతం ఒప్పించే విధంగా శివసేన తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.

సాయంత్రానికి తేలిపోనుందా...

సాయంత్రానికి తేలిపోనుందా...

సాయంత్రం గవర్నర్ తో శివసేన నేతలు భేటీ కానున్నారు. అయిదు గంటలకు అప్పాయింట్ మెంట్ ఖరారైనట్లుగా తెలుస్తోంది. శరద్ పవార్ తో మంతనాలు పూర్తి కావటం..కాంగ్రెస్ అభిప్రాయం సైతం ఆ సమయంలో గా తెలిసే అవకాశం ఉందని శివసేన అంచనా వేస్తోంది. కాంగ్రెస్ నిర్ణయం ఆలస్యం అయితే..గవర్నర్ ను మరి కొంత సమయం కోరే అవకాశం ఉంది. అయితే, ప్రజలు తమను ప్రతిపక్షంలో కూర్చోమని తీర్పు ఇచ్చారంటూ గతంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్..అదే విధంగా తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జన ఖర్గే వ్యాఖ్యానించారు. అయితే, మారుతున్న సమీకరణాలతో ఇప్పటికే శివసేన ఎన్డీఏ నుండి తమ డిమాండ్ మేరకు బయటకు రావటం..ఎన్సీపీ సైతం శివసేనక మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉండటంతో..ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారింది. ఇదే సమయంలో స్వతంత్ర అభ్యర్ధులను సైతం తమ వైపు తిప్పుకొనేందుకు శివసేన చివరి ప్రయత్నాలు చేస్తోంది.

English summary
Senior leader pallam Raju says congress have always maintained distance from the right wing party Shiv Sena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X