వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

republic, abc c voter exitpoll-మహారాష్ట్ర, హర్యానాలో కమలానికే పట్టం, కానరాని కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర, హర్యానాలో మరోసారి బీజేపీ విజయదుందుబి మోగిస్తోందని జాతీయ చానెల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. దాదాపు అన్నీ చానెల్స్ బీజేపీ భాగస్వామ్య పక్షం అధికారం చేపడుతుందని పోల్ ఫలితాలను వెల్లడించాయి. మ్యాజిక్ ఫిగర్‌ దాటి బీజేపీ స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించడం గమనార్హం. మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ విపక్షానికే పరిమితం అవుతుందని అన్ని చానెల్ సర్వే ప్రకటించాయి.

విజయదుందుబి

విజయదుందుబి

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన 223 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తున్నాయని రిపబ్లిక్ జాన్ కీ బాత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 288 సీట్లు ఉండగా 223 మార్కుకు బీజేపీ-శివసేన చేరతాయని అంచనాలు కమలదళానికి బూస్ట్ నిస్తోంది. కానీ కాంగ్రెస్-ఎన్సీపీ మాత్రం 54 సీట్లతో సరిపెట్టుకుందని కఠోర నిజాన్ని వెల్లడించింది. ఇండిపెండెంట్లు, ప్రాంతీయ పార్టీలు 11 స్థానాలతో సరిపెట్టుకుంటుందని వెల్లడించింది.

కమల వికాసం

కమల వికాసం

ఇక ఏబీసీ సీ ఓటర్ మాత్రం బీజేపీ-శివసేన మాత్రం 204 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. రిపబ్లిక్ జాన్ కీ బాత్ కన్నా 19 సీట్లు తగ్గినా.. కమల దళం హవా మాత్రం తగ్గలేదు. మరోసారి అధికారం చేపట్టబోతోంది. కాంగ్రెస్-ఎన్సీపీ మాత్రం 69 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. రిపబ్లిక్ జన్ కీ బాత్ కన్నా 15 సీట్లు కూటమికి కలిసి వస్తోంది. దీంతో ఇతరులు కూడా 15 సీట్లు గెలుచుకుంటారని తెలిపారు. రిపబ్లిక్‌తో పోలిస్తే మరో 4 సీట్లు కూడా అదర్స్ గెలుచుకోనుండటం విశేషం.

హర్యానాలో కూడా

హర్యానాలో కూడా

హర్యానాలో కూడా కమలం వికసిస్తోందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. రాష్ట్రంలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారం చేపట్టేందుకు 45 స్థానాల్లో గెలిస్తే సరిపోతుంది. రిపబ్లిక్ జన్ కీ బాత్ ప్రకారం హర్యానాలో బీజేపీ కూటమి 57 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. కాంగ్రెస్ మాత్రం 17 సీట్లతో సరిపెట్టుకోనుంది. ఇతరులు 16 సీట్లు గెలుచుకుంటారని తెలిపింది.

కమలం హవా

కమలం హవా

హర్యానాకు సంబంధించి ఏబీసీ సీ ఓటర్ అంచనాలు ఇలా ఉన్నాయి. అధికార బీజేపీ 72 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొన్నది. అంటే బీజేపీ కూటమికి తిరిగే లేదని అర్థమవుతుంది. రిపబ్లిక్ కన్నా 15 సీట్లు ఎక్కువ ఇవ్వడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం 8 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. రిపబ్లిక్ కన్నా 9 సీట్లు తక్కువగా గెలుస్తోందని ఏబీసీ సీ ఓటర్ పేర్కొన్నది. ఏబీపీ సీ ఓటర్ అంచనా ప్రకారం ఇతరులు 10 సీట్లు గెలుచుకుంటారని పేర్కొన్నది. రిపబ్లిక్ కన్నా ఆరు స్థానాలు తక్కువే గెలుస్తుందని తెలిపింది.

English summary
maharashtra-haryana assembly will won the bjp. republic jann kibaat, abc c voter exit poll reveal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X