మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు: రూ 558 కోట్లను సీజ్ చేసిన ఈసీ

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సిద్ధం చేసిన రూ. 558 కోట్ల విలువైన నగదు, ఉచితాలు, మద్యం, డ్రగ్స్, ఇతర విలువైన ఆభరణాలను ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. మహారాష్ట్ర నుంచి రూ. 280 కోట్లను, జార్ఖండ్ రాష్ట్రం నుంచి 158 కోట్లను ఎన్నికల అధికారులు, పోలీసులు సీజ్ చేశారు.

2019 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ స్వాధీనం చేసుకున్న మొత్తం 3.5 రేట్లు అధికం కావడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఈసీ స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 103.61 కోట్లు కాగా, జార్ఖండ్ రాష్ట్రంలో సీజ్ చేసింది రూ. 18.76 కోట్లుగా ఉంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయని, ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.

Maharashtra Jharkhand elections Election commission seized Rs 558 crore

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. నిఘా పెంచి ఓటర్లను ప్రలోభపెట్టేవారిని అదుపులోకి తీసుకుంటున్నారు.

రెండు రాష్ట్రాల్లోని 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (మహారాష్ట్ర -91, జార్ఖండ్ -19) నిశితంగా నిఘా ఉంచారు. ఎలక్షన్ కమిషన్ cVIGIL యాప్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను ఫ్లాగ్ చేయడానికి పౌరుల చేతుల్లో సమర్థవంతమైన సాధనంగా కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు 9681 ఫిర్యాదులను సీవిజిల్ యాప్ ద్వారా పరిష్కరించారు.

cVigil అనేది యూజర్ ఫ్రెండ్లీ, సులభంగా ఆపరేట్ చేయగల అప్లికేషన్. ఇది అప్రమత్తమైన పౌరులను జిల్లా కంట్రోల్ రూమ్, రిటర్నింగ్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలతో కలుపుతుంది. ఈ యాప్‌ని ఉపయోగించడం ద్వారా, పౌరులు ఏదైనా ఎన్నికల సంబంధిత ఉల్లంఘనల సంఘటనలపై వెంటనే రిపోర్ట్ చేయవచ్చు. 100 నిమిషాల టైమ్‌లైన్‌లో చర్య తీసుకోవడం జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+