బల్లార్షాలో కూలిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి: 8 మంది పరిస్థితి విషమం, 20 మందికిపైగా గాయాలు
ముంబై: మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్‌లో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రాపూర్‌లోని బల్లార్షా రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ వంతెన కొంత భాగం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 20 మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది.
రైల్వే స్టేషన్లో ఒక ఫ్లాట్ ఫాం నుంచి వేరే ఫ్లాట్ ఫాంకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జిపై నడుస్తుండగా.. ప్రమాదం జరగడంతో చాలా మంది ప్రయాణికులు దాదాపు 60 అడుగుల ఎత్తు నుంచి కిందికి జారిపడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

రైల్వే స్టేషన్‌లోని ఒకటవ నెంబర్ ఫ్లాట్ ఫాం నుంచి 4వ నెంబర్ ఫ్లాట్ ఫాంపైకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని సహాయక సిబ్బంది, అధికారులు హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యల్లో తోటి ప్రయాణికులు, ఐఆర్ సీటీసీ సిబ్బంది పాల్గొన్నారు. అయితే, ప్రమాదం జరిగని సమయంలో రైళ్లు ఏవీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి.
#WATCH | Slabs fall off of a foot over bridge at Balharshah railway junction in Maharashtra's Chandrapur; people feared injured pic.twitter.com/5VT8ry3ybe
— ANI (@ANI) November 27, 2022
కాగా, తీవ్రంగా గాయపడిన ప్రయాణికులకు రూ. లక్ష, గాయపడిన ప్రయాణికులకు రూ. 50 వేలు పరిహారాన్ని ప్రకటించింది రైల్వేశాఖ.












Click it and Unblock the Notifications