వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CM: న్యాయపోరాటం చెయ్యాలని డిసైడ్ అయిన సీఎం, వేటు వేస్తారా ? రూటుమారుస్తారా ?, రెబల్స్ వెయిటింగ్!

|
Google Oneindia TeluguNews

ముంబాయి/గుహవాటి/న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే న్యాయపోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఎలాగైనా మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాడి (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వం కాపాడుకోవాలని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు రంగంలోకి దిగారు. నిజమైన శివసేన పార్టీ మాదే, నిజమైన బాలాసాహెబ్ ఠాక్రే వారసులు మేమే అంటూ శివసేన పార్టీ రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే మీడియా ముందు చెప్పడంతో ఉద్దవ్ ఠాక్రే మద్దతుదారులు మండిపడుతున్నారు.

ఇదే సమయంలో రెబల్ ఎమ్మెల్యేల మెడలు వంచి వెనక్కి పిలిపించుకోవాలని, శివసేన పార్టీని కాపాడుకోవాలని డిసైడ్ అయిన సీఎం ఉద్దవ్ ఠాక్రే న్యాయపోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, అడ్వకేట్ జనరల్ తో చర్చలు జరుపుతున్న సీఎం ఉద్దవ్ ఠాక్రే రెబల్ ఎమ్మెల్యేల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యారని ఆయన మద్దతు దారులు అంటున్నారు.

Shiv Sena: ఏక్ నాథ్ మీద వేటువేసిన సీఎం ఠాక్రే, షిండే స్థానంలో చౌధరి, స్పీకర్ గ్రీన్ సిగ్నల్!Shiv Sena: ఏక్ నాథ్ మీద వేటువేసిన సీఎం ఠాక్రే, షిండే స్థానంలో చౌధరి, స్పీకర్ గ్రీన్ సిగ్నల్!

క్యూలో నలుగురు ఎమ్మెల్యేలు?

క్యూలో నలుగురు ఎమ్మెల్యేలు?

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకి ఆ పార్టీలోని ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతోంది. నలుగురు శివసేన ఎమ్మెల్యేలు సీఎం ఉద్దవ్ ఠాక్రే శిబిరం నుంచి జంప్ కావడానికి సిద్దంగా ఉన్నారని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే సీఎం ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడికిపోరని ఆయన మద్దతుదారులు అంటున్నారు.

పంచ్ పడింది

పంచ్ పడింది

మహారాష్ట్రకు ముఖ్యమంత్రి కావాలని తనకు ఎలాంటి ఆశలేదని, అలా ఎప్పుడు నేను ఆశపడలేదని ఏక్ నాథ్ షిండే అంటున్నారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఏక్ నాథ్ షిండేకి తగినంత ఎమ్మెల్యేల మద్దతు ఉంది. రెబల్ ఎమ్మెల్యేలను వెనక్కి పిలిపించుకోవాలని ఆలోచిస్తున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే శివసేన పార్టీ శాసనసభా పక్షనేతగా ఉన్న ఏక్ నాథ్ షిండేని ఆ పదవి నుంచి తప్పించారు.

డిసైడ్ అయిన సీఎం

డిసైడ్ అయిన సీఎం

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ లో ఉన్న శివసేన పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అజయ్ చౌధరిని ఆ పార్టీ శాసనసభా పక్షనేతగా నియమిస్తున్నామని సీఎం మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కు లేఖ రాశారు. శివసేన పార్టీ శాసనసభాపక్ష నేతగా అజయ్ చౌధరిని తాము గుర్తించామని మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కార్యాలయం స్పష్టం చేసింది.

సీఎం న్యాయపోరాటం

సీఎం న్యాయపోరాటం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే న్యాయపోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యారు. నిజమైన శివసేన పార్టీ మాదే, నిజమైన బాలాసాహెబ్ ఠాక్రే వారసులు మేమే అంటూ శివసేన పార్టీ రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే మీడియా ముందు చెప్పడంతో ఉద్దవ్ ఠాక్రే మద్దతుదారులు మండిపడుతున్నారు.

 అడ్వకేట్ జనరల్, డిప్యూటీ స్పీకర్ తో చర్చలు

అడ్వకేట్ జనరల్, డిప్యూటీ స్పీకర్ తో చర్చలు

రెబల్ ఎమ్మెల్యేల మెడలు వంచి వెనక్కి పిలిపించుకోవాలని, శివసేన పార్టీని కాపాడుకోవాలని డిసైడ్ అయిన మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే న్యాయపోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి ఝువారి, మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్ తో చర్చలు జరుపుతున్న సీఎం ఉద్దవ్ ఠాక్రే రెబల్ ఎమ్మెల్యేల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యారని ఆయన మద్దతు దారులు అంటున్నారు. ఇదే సమయంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారిని కలిసి ప్రస్తుత పరిస్థితులు వివరించాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు సిద్దం అయ్యారని సమాచారం.

English summary
Maharashtra political crisis: CM Uddhav Thackeray to be decided by legal battles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X