ఘోరం: ఇళ్లపై కొండచరియలు పడి 36మంది దుర్మరణం, శిథిలాల్లో ఇంకొందరు -భారీ వర్షాల వల్ల
గడిచిన నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు మహారాష్ట్ర అతలాకుతలం అయింది. రాజధాని ముంబైతోపాటు థానే, రత్నగిరి, రాయ్‌గఢ్, కొల్ఘాపూర్ జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వానల వల్ల పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరగ్గా, తాజాగా ఇంకొన్ని ఘోర సంఘటనలు చోటుచేసుకున్నాయి..
రికార్డు స్థాయిలో అసాధారణ వర్షం కురవడంతో రాయ్‌గఢ్ జిల్లాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. జిల్లాలోని మహద్‌తలై సహా మూడు ప్రాంతాల్లో శుక్రవారం కొండచరియలు విరిగిపడటంతో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాల ధాటికి విరిగిపడ్డ కొండచరియలు, బురద ప్రవాహం ఇళ్లను ముచెత్తడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు.

రాయ్‌గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడినట్లు సమాచారమందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్, నేవీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 36 మంది మరణించినట్లు రాయ్‌గఢ్ కలెక్టర్ తెలిపారు. మరో 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబై-గోవా హైవేపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. అటు కొల్హాపూర్‌లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. భారీ వర్షాలకు ముంబయి- బెంగళూరు హైవే ఓ చోట కుంగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. రత్నగిరి జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. వర్షాల ధాటికి తీర ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. కొండచరియలు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితి సమీక్షిస్తున్నారు..
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications