మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు, 4 నెలల్లో అత్యధికం: ఢిల్లీలోనూ కలవరం

న్యూఢిల్లీ/ముంబై: దేశంలో మరోసారి కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి.
మహారాష్ట్రలో గురువారం 2,813 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయిఇది నాలుగు నెలల్లో అత్యధికం. ఒక మరణం మైందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

తాజా ఇన్ఫెక్షన్లతో మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,571కి చేరుకుందని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. రాష్ట్ర రాజధాని ముంబై 1,702 కేసులతో అంటువ్యాధులలో స్వల్ప తగ్గుదలని నివేదించింది. మునుపటి రోజు కంటే 63 తక్కువ, ఒక మరణం నమోదైందని బృహన్ ‌ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది.

 Maharashtra Reports 2,813 COVID Cases, Highest In Four Months, delhi reports cases hike

కొత్త కేసులతో ముంబైలో కేసుల సంఖ్య 10,75,243కి పెరిగింది, మరణాల సంఖ్య 19,570కి పెరిగింది. నాలుగు రోజుల విరామం తర్వాత నగరం వైరస్‌తో సంబంధం ఉన్న మరణాన్ని నమోదు చేసిందని బీఎంసీ వెల్లడించింది.

ఫిబ్రవరి 15 నుంచి 2,831 ఇన్‌ఫెక్షన్లు వెలుగులోకి వచ్చిన తర్వాత మహారాష్ట్రలో రోజువారీ కోవిడ్ కేసుల పెరుగుదల అత్యధికం. తాజా అంటువ్యాధుల సంఖ్య 79,01,628కి, మరణాల సంఖ్య 1,47,867కి చేరుకుంది. ముంబైలో కోవిడ్ పాజిటివిటీ రేటు 9.64 శాతంగా ఉందని బీఎంసీ తెలిపింది.

ముంబై నగరంలో గురువారం మొత్తం 17,648 పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,72,44,826కి చేరుకుంది. 1,702 మంది కొత్త రోగులలో, 1,624 మంది లక్షణాలు లేనివారు కాగా, 78 మంది రోగలక్షణ రోగులు ఆస్పత్రులలో చేరారు. వారిలో, ఏడుగురు రోగులు ఆక్సిజన్ సపోర్టులో ఉన్నారని, 24,603 ఆసుపత్రి పడకలలో, 323 పడకలు ప్రస్తుతం రోగులతో ఉన్నాయని బులెటిన్ తెలిపింది.

ఢిల్లీలోనూ పెరుగుతున్న కరోనా కేసులు

ఢిల్లీలో గత 24 గంటల్లో 622 కొత్త కోవిడ్-19 కేసులు, 537 కోలుకోవడం, 2 మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీ నగర ఆరోగ్య శాఖ పంచుకున్న డేటా ప్రకారం.. పాజిటివిటీ రేటు రేటు 3.17 శాతానికి పెరిగింది. దీంతో ఢిల్లీలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 19,10,613కి చేరుకోగా, మృతుల సంఖ్య 26,216కి చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+