వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా ఉధృతి: 60వేలకుపైగానే కొత్త కేసులు, 200లకుపైగా మరణాలు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 60,212 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 35,19,208కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 281 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 58,526కి చేరినట్లు మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

గడిచిన 24 గంటల వ్యవధిలో 31,624 మంది బాధితులు కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 5,93,042 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 2,25,60,051 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,94,398 హోంక్వారంటైన్లో ఉండగా, 30,399 ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపింది.

 Maharashtra reports 60,212 new coronavirus cases, 281 die

కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో 15 రోజులపాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించింది మహారాష్ట్ర సర్కారు. ఏప్రిల్ 14 నుంచి రాత్రి 8 గంటల నుంచి ఉదయం వరకు ఈ కర్ఫ్యూ విధించనున్నారు.

ఇక రాజధాని ముంబై నగరంలో కొత్తగా 7873 కరోనా కేసులు నమోదు కాగా, 27 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,35,264 చేరగా, మరణాల సంఖ్య 12,093కు చేరింది. మహారాష్ట్రలో రికవరీ రేటు 81.44 శాతం ఉండగా, మరణాల రేటు 1.66 శాతంగా ఉంది. ముంబై డివిజన్లో 16,596 కరోనా కేసులు వెలుగుచూశాయి.

నాసిక్ డివిజన్లో 8650 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. పుణె డివిజన్లో 12,372 కొత్త కేసులు వెలుగుచూశాయి. కొల్హాపూర్ డివిజన్లో 1528 కరోనా కేసులు, లాతూరు డివిజిన్లో 5210, అకోలడివిజన్లో 1430కి, నాగపూర్ డివిజన్లో 11,093 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

English summary
60,212 fresh coronavirus positive cases, taking the tally to 35,19,208 while 281 fatalities pushed the toll to 58,526, the state health department said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X