మరో రెండు అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం-రెండు,మూడు రోజుల్లో షెడ్యూల్..!

తాజాగా హర్యానా, జమ్మూ-కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో గుడువు ముగియబోతున్న మరో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్దమవుతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ, సమస్యాత్మక పరిస్ధితులపై అధ్యయనం చేసిన ఈసీ.. దసరా పండుగ కారణంగా షెడ్యూల్ ప్రకటన ఆలస్యం చేసింది. దీంతో రెండు, మూడు రోజుల్లో ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్స్ విడుదల కానున్నాయి.

మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ అసెంబ్లీల గడువు ముగియనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్దమవుతోంది. ఇప్పటికే ఓటర్ల జాబితాల సవరణతో పాటు క్షేత్రస్దాయిలో పరిస్ధితుల్ను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న ఈసీ త్వరలో షెడ్యూల్ విడుదల చేయబోతోంది. ఇప్పటికే హర్యానా, జమ్మూ-కశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో జార్ఖండ్ తో పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా సోమవారం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Maharastra and Jharkhand Assembly Election schedules soon how many phases expected

జార్ఖండ్ లో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల్ని రెండు దశల్లో నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. నవంబర్ 15న జార్ఖండ్ ఆవిర్బావ దినోత్సవం ఉంది. దీంతో అదే రోజు పోలింగ్ ఉండే అవకాశాలు లేకపోలేదు. అలాగే ఫలితాలను నవంబర్ మూడో వారంలో విడుదల చేయనున్నారు. దీంతో పాటే మహారాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించి దాదాపు అదే రోజు ఫలితాలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+