కేరళలో గాంధీ విగ్రహం ధ్వంసం: తమిళనాడులో అంబేడ్కర్ విగ్రహానికి అవమానం..

Recommended Video

    Statue vandalisation row: BR Ambedkar, Mahatma Gandhi statues damaged

    తిరువనంతపురం: త్రిపురలో 'లెనిన్' విగ్రహంతో మొదలైన విగ్రహాల కూల్చివేతకు తెరపడటం లేదు. తమిళనాడులో పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసి గంటలు గడవకముందే.. కేరళలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

    కేరళ కన్నూరు జిల్లాలోని తలైపెరంబులో బుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. గాంధీ కళ్లజోడుతో పాటు, మెడలోని దండను వారు ధ్వంసం చేసినట్టు చేసినట్టు తెలుస్తోంది.

    Mahatma Gandhi’s Statue Vandalised In Kerala's Kannur

    అయితే ఈ విగ్రహం ధ్వంసం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని తాము భావించడం లేదని, దీన్ని మరో కోణంలో చూడాలని పోలీసులు పేర్కొనడం గమనార్హం.

    ఇదిలా ఉంటే, తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని తిరుఒట్టియూరులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అవమానించారు. విగ్రహంపై ఎర్ర రంగు పోసి పారిపోయారు. గత రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది.

    కాగా, గడిచిన 60గంటల్లో ఐదు రాష్ట్రాల్లో దాదాపు 6విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. ఇందులో లెనిన్, అంబేడ్కర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ,గాంధీ,పెరియార్ ల విగ్రహాలు ఉన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+