పాక్ కవ్వింపు, బార్డర్‌లో కాల్పులు: రాజ్ తీవ్ర హెచ్చరిక
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్ముకాశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్ వద్ద పాక్ బలగాలు కాల్పులకు దిగాయి. దీనికి ధీటుగా స్పందించిన భారత సైన్యం పాకిస్తాన్‌ను సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ కాల్పుల విరమణకు పాల్పడటం ఈ రోజులో ఇది రెండోసారి.
అంతకుముందు జమ్ముకాశ్మీర్‌లోని అర్నియాలోని బీఎస్ఎఫ్ పోస్టులు, జనావాసాల పైన పాకిస్తాన్ రేంజర్స్ దాడులకు దిగాయి. ఈ దాడులలో ఐదుగురు పౌరులు మృతి చెందారు. 29 మంది వరకు గాయపడ్డారు. పాకిస్తాన్ రేంజర్స్ ఈ దాడుల్లో మోర్టార్స్ ఆటోమేటిక్ ఆయుధాలు వాడుతున్నారు.

పాకిస్తాన్ రేంజర్స్ కాల్పుల్లో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ రిలీఫ్ టీంలు సంఘటన స్థలానికి వెంటనే చేరుకున్నాయి. పాకిస్తాన్ కవ్వింపు చర్యల పైన హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ కాల్పులను తాము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. పాక్ కవ్వింపు చర్యలను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టిందన్నారు.
పాకిస్తాన్ హోంమంత్రికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్‌లో పరిస్థితులు మారాయన్న విషయం పాకిస్తాన్ గుర్తించాలన్నారు. కాల్పులు ఆపకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాజ్‌నాథ్ బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. సరిహద్దుల్లోని తాజా పరిస్థితి పైన నివేదిక ఇవ్వాలని సూచించారు.












Click it and Unblock the Notifications