ఆర్కే స్టూడియో భారీ అగ్ని ప్రమాదం: తప్పిన పెనుముప్పు

Subscribe to Oneindia Telugu

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఆర్కే సినిమా స్టూడియోలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకటో నంబర్‌ హాల్‌ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు.

విద్యుదాఘాతంతోనే ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. స్టుడియోలో కొద్దిరోజులుగా విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కార్మికులు పనులు చేస్తున్న సమయంలో షార్ట్‌సర్క్యూట్‌ సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని టీవీ షో 'సూపర్‌ డ్యాన్సర్‌' సెట్‌ ఉంది.

అయితే, శనివారం కావడంతో సెట్‌ ఖాళీగా ఉంది. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. కాగా, ఈ స్టుడియోను బాలీవుడ్‌ ప్రఖ్యాత నటుడు రాజ్‌కపూర్‌ 1948లో స్థాపించగా, ప్రస్తుతం ఆయన కుమారుడు రిషి కపూర్‌ దాని యజమానిగా కొనసాగుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Read in English: Fire at RK Studio in Mumbai
English summary
A major fire broke out at famous Raj Kapoor Studio in Mumbai.The fire broke out at the sets of TV show 'Super Dancer'. There was no crew on the set at the time of incidence.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి