హీరో ఇంటిలో ఏనుగు దంతాలు: రచ్చ రచ్చ

తిరువనంతపురం: మళయాల హీరో జయరామ్ కు కష్టాలు మొదలైనాయి. ఆయన అక్రమంగా ఏనుగు దంతాలు ఇంటిలో పెట్టుకున్నారని, వెంటనే ఆయన మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వన్య ప్రాణుల హక్కుల ఉద్యమకారులు మండిపడుతున్నారు.

జయరామ్ మళయాలంతో పాటు పలు తమిళ సినిమాలలో నటించాడు. ఇతనికి ఒక పెంపుడు ఏనుగు ఉండేది. ఆ ఏనుగు రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించింది. తరువాత ఆ ఏనుగుకు ఉన్న రెండు దంతాలను తొలగించి ఆయన దగ్గరే పెట్టుకున్నారు.

Malayalam Actor Jayaram’possession of Elephant Tusks Kicks up Row

ఏనుగు దంతాలు ఇంటిలో పెట్టుకోవడానికి కేరళ అటవీ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే ఈ విషయం ఇటివల బయటపడటంతో వన్య ప్రాణుల హక్కుల ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. జయరామ్ కు ఒక న్యాయం, మిగిలిన వారికి మరో న్యాయమా అని వారు ప్రశ్నిస్తున్నారు.

దీనివల్ల ప్రజలలో తప్పుడు సంకేతాలు తీసుకు వెళ్తాయని జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. 2003 డిక్లరేషన్ వైల్డ్ లైఫ్ స్టాక్ రూల్ ప్రకారం అది నేరం అంటున్నారు. ఆందోళన తీవ్రం కావడంతో కేరళ ఫారెస్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ వ్రాసి జోక్యం చేసుకోవాలని మనవి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+