Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సూపర్ స్టార్ ‘విడుదల’... జైలు వద్ద అభిమానుల సందడి!

మళయాళ నటుడు దిలీప్‌ జైలు నుంచి విడుదలవుతారని తెలియగానే ఆయన అభిమానుల సంబరం అంతా ఇంతా కాదు. తమ అభిమాన హీరో, సూపర్ స్టార్ దిలీప్ విడుదల కోసం అలువా జైలుకు భారీ సంఖ్యలో ఆయన మద్ధతుదారులు తరలివచ్చారు.

కొచ్చి: మళయాళ నటుడు దిలీప్‌ జైలు నుంచి విడుదలవుతారని తెలియగానే ఆయన అభిమానుల సంబరం అంతా ఇంతా కాదు. తమ అభిమాన హీరో, సూపర్ స్టార్ దిలీప్ విడుదల కోసం అలువా జైలుకు భారీ సంఖ్యలో ఆయన మద్ధతుదారులు తరలివచ్చారు.

దాదాపు మూడు నెలల పోరాటం తర్వాత ఎట్టకేలకు మంగళవారం దిలీప్‌కు కేరళ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్‌, లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన దిలీప్ 85 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల అయ్యారు.

dileep-fans

గత జూలైలో దిలీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అలువా జైలుకు తరలించి విచారణ చేపట్టారు. గతంలో నాలుగుసార్లు బెయిల్ కోసం దిలీప్ దాఖలు చేసిన పిటీషన్లను కోర్టులు తిరస్కరించాయి.

జూలై 24న తొలిసారి దిలీప్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు తిరస్కరించడంతో మళ్లీ ఆగస్టు 10న మరోసారి పిటిషన్ వేసుకోగా అప్పుడు కూడా దిలీప్‌కు బెయిల్ విషయంలో చుక్కెదురైంది. నాలుగోసారి సెప్టెంబర్ 18న కూడా అతడి బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీని నటుడు దిలీప్ పురమాయించాడని పోలీసులు భావించారు. తమవద్ద ఈ కేసులో తగిన ఆధారాలున్నాయని, ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని ప్రాసిక్యూషన్‌ వాదనతో న్యాయస్థానం ఏకీభవించి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

తాజాగా బెయిల్‌ కోసం దిలీప్‌ చేసుకున్న అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. తన పాస్ పోర్టును అధికారులకు స్వాధీనం చేయాలని, లక్ష రూపాయల బాండుతోపాటు ఇద్దరు వ్యక్తిగత పూచీకత్తు ఉంచాలని కోర్టు సూచించింది. మరోవైపు తమ హీరో దిలీప్ జైలు నుంచి విడుదలకానున్నాడని తెలియగానే ఆయన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

దిలీప్ విడుదల కోసం ఆయన ఉన్న అలువా జైలు వద్దకు భారీ సంఖ్యలో సూపర్ స్టార్ అభిమానులు తరలివవచ్చారు. కొందరు తమ హీరో కటౌట్లను జైలు వద్దకు తీసుకొచ్చి హడావుడి చేశారు.

దిలీప్ విడుదలకు సంబంధించిన ఫార్మాలిటీస్ ను ఆయన సోదరుడు అనూప్, ఇతర కుటుంబ సభ్యులు చూసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ముందే అన్నీ పూర్తి చేసి వారు అలువా సబ్ జైలు వద్దకు చేరుకున్నారు.

జైలు నుంచి విడుదలై బయటికి రాగానే నటుడు దిలీప్ రెండు చేతులు ఎత్తి జోడించి తన అభిమానులకు అభివాదం చేశాడు. ఆయన్ని చూడగానే అభిమానులు కూడా పెద్ద పెట్టున హర్షాతిరేకం వ్యక్తం చేశారు. ఆ వెంటనే దిలీప్ తన కారులో కూర్చుని అలువాలోనే ఉన్న తన ఇంటికి బయలుదేరాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+