జల్లికట్టు.. ఈసారైనా ఆస్కార్ పట్టు -ఉత్తమ విదేశీ కేటగిరీకి భారత్ ఎంట్రీగా మలయాళ సినిమా ‘జల్లికట్టు’
ఏరకంగా చూసినా మనవి కానప్పటికీ.. ప్రపంచం మెచ్చేలా సినిమాలు తీస్తోన్న భారతీయులకు 'ఆస్కార్ బెస్ట్ ఫిలిం' ఇప్పటికీ అందని ద్రాక్షలాగే ఉండిపోయింది. అయితే, ఈసారి ఆస్కార్ లో కుమ్మేస్తానంటూ 'జల్లికట్టు' దూసుకురావడం అందరిలో ఆశలు రేకెత్తిస్తున్నది. 2020 అస్కార్ అవార్డులకుగనూ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీ కింద భారత్ అధికారిక ఎంట్రీగా మలయాళ సినిమా 'జల్లికట్టు' ఎంపికైంది.
బీజేపీ భారీ స్ట్రోక్: పవన్, జగన్కు షాక్ -దాసరికే తిరుపతి టికెట్! -పనబాకకు చంద్రబాబు ఝలక్?
భారత్ తరఫున ఆస్కార్ స్క్రీనింగ్ కు 'జల్లికట్టు' సినిమాను పంపుతున్నట్లు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎఫ్ఐ) బుధవారం అధికారి ప్రకటన చేసింది. హిందీ, ఒడియా, మరాఠీ తదితర భాషల నుంచి మొత్తం 27 ఎంట్రీలు రాగా, వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం.. మలయాళ సినిమా 'జల్లికట్టు'ను ఆస్కార్ ఎంట్రీగా జ్యూరీ నిర్ధారించినట్లు ఎఫ్ఎఫ్ఐ చైర్మన్ రాహుల్ రవాయిల్ తెలిపారు.

''మనిషితో ముడిపడిన అనేక సమస్యలను అచ్చంగా, అద్భుతంగా చిత్రీకరించిన సినిమా ఇది. మనం జంతువులకంటే ఎంత అధ్వాన్నంగా ఉన్నామో కళ్లకు కట్టినట్లు చూపించింది. దర్శకుడు లిజో జోస్ పెల్లిసరీ నిజంగా సమర్థుడు. జల్లికట్టును ఆస్కార్ ఎంట్రీగా ఖరారు చేసే క్రమంలో జ్యూరీ భావోద్వేగానికి గురైంది. జల్లికట్టు కంటే ముందు లిజో తీసిన ''అంగమాలి డైరీస్'', ''ఈ మా యూ'' సినిమాలూ ఆయన పనితీరుకు తార్కాణాలుగా నిలిచాయి'' అని ఎఫ్ఎఫ్ఐ చైర్మన్ అన్నారు. 2019 ఆస్కార్ అవార్డుల్లో భారత్ ఎంట్రీగా వెళ్లిన 'గల్లీ బాయ్స్' సినిమా సందడి చేయకుండా సైలెంట్ గా రిజెక్ట్ అయింది. మరి ఈసారైనా, దున్నపోతు కథాంశంతో రూపొందిన 'జల్లికట్టు' రంకెలు వేస్తుందో లేదో డిసెంబర్ చివరి వారం దాకా ఆగాలి.

లీజో జోస్ పెల్లిస్సరి దర్శకత్వంలో.. ఆంటోనీ వర్ఘీస్, చెంబన్ వినోద్ జోస్, శాంతి బాలచంద్రన్, సబుమోన్ అబ్దుసమద్, జాఫర్ ఇదుక్కి తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందిన జల్లికట్టు సినిమా గతేడాది సెప్టెంబర్ లో విడుదలైంది. టీజన్ నుంచే టెన్షన్ పుట్టించిన ఈ సీనిమా ప్రేక్షకుల్ని మంత్రముగ్ఢులు చేయగా, దేశవిదేశాల్లో ప్రశంసలు లభించాయి. ఒరిజినల్ మలయాళ వెర్షన్ 'అమెజాన్ ప్రైమ్'లో, తెలుగు డబ్బింగ్ వెర్షన్ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.
వ్యాక్సిన్ వేసుకున్నా కొవిడ్-19వ్యాధి? -సమర్థత, సరఫరాపై గందరగోళం -ఈ ప్రశ్నలకు బదులేది?