వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాపింగ్ మాల్స్‌లో ఇలాంటి రూల్సా! : ఆటోలో వెళ్లినందుకు ఇలానా?

|
Google Oneindia TeluguNews

ముంబై : దేశంలో కొన్ని వాణిజ్య సంస్థలు.. సగటు వినియోగదారుడి పట్ల అవమానకర రీతిలో వ్యవహరిస్తున్నాయి. సాధారణంగా బ్రాండెడ్ ఐటెమ్స్ ఉపయోగించడానికి కస్టమర్స్
ఎలా అయితే ఆసక్తి చూపుతారో.. తమ మాల్స్ కు వచ్చేవారు కూడా ఓ రేంజ్ మెయింటెయిన్ చేసే వ్యక్తులై ఉండాలి అంటున్నాయి కొన్ని వాణిజ్య సంస్థలు.

తాజాగా ముంబైలో వికాస్ తివారీ(28) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు ఇదే సమాధానంతో షాక్ ఇచ్చింది ఓ షాపింగ్ మాల్ యాజమాన్యం. దీపావళి పండుగ సందర్బంగా.. కుటుంబంతో కలిసి షాపింగ్ చేయడానికి ముంబై శివారు ప్రాంతమైన కుర్లాలో.. ఫోయెన్సిక్ మార్కెట్ సిటీ అనే మాల్ కు వెళ్లాడు. అయితే వారంతా ఆటోలో వెళ్లడంతో.. ఎంట్రన్స్ గేట్ వద్దే సెక్యూరిటీ గార్డు వారికి 'నో ఎంట్రీ' అని చెప్పేశాడు.

Mall in trouble after turning back family that arrived in auto

మాల్ లోపల ఆటోలను పార్కింగ్ చేసేందుకు అనుమతి లేదని సెక్యూరిటీ చెప్పడంతో వికాస్ కంగు తిన్నాడు. ఆటోలకు ఎంట్రీ లేదని ఎక్కడ రాశారని గార్డును ప్రశ్నించాడు. దీంతో వికాస్ ను సెక్యూరిటీ క్యాబిన్ లోకి తీసుకెళ్లాడు ఓ గార్డు. ఈ వ్యవహారం మొత్తాన్ని వికాస్ తన మొబైల్ లో బంధించాడు. క్యాబిన్ కు వెళ్లాక సెక్యూరిటీకి తనకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు వికాస్.

తీరా అక్కడికి వచ్చి అసలు విషయం తెలుసుకున్నాక పోలీసులు నవ్విపోయారని వికాస్ తెలిపాడు. చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా వారు సూచించారని, అయితే తనతో పాటు ఫ్యామిలీ కూడా ఉండడంతో.. ఎవరూ ఇబ్బందిపడవద్దనే ఉద్దేశ్యంతో ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నాడు. ప్రతీరోజు కొన్ని వందలమందిని మాల్స్ వద్ద దిగబెడుతున్న ఆటోలను లోపలికి ఎందుకు అనుమతించరు అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడు వికాస్.

English summary
Vikas Tiwari, a 28-year-old software engineer, had wanted to take his family for Diwali shopping, and decided to head to Phoenix Marketcity in Kurla (W) in his brother’s auto rickshaw last Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X