డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డీలిమిటేషన్ ప్రక్రియపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ అలాగే భారత్ ను రెండుగా విభజించేందుకే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని తీవ్ర ఆరోపరణలు చేశారు. హౌరాలోని దోంజూర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ కేంద్రంలో డీలిమిటేషన్ బిల్లుకు పూర్తి మద్దతు లేదని అన్నారు. బీజేపీకు టీడీపీ, జేడీయూ మద్దతు మాత్రమే ఉందని పేర్కొన్నారు. పొలిటికల్ మైలేజీ కోసమే డీలిమిటేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
ఇక కేంద్రంలో బీజేపీకు పూర్తి స్థాయి మద్దతు లేదని మమతా బెనర్జీ అన్నారు. టీడీపీ, జేడీయూ మద్దతుతోనే ఆ పార్టీ అధికారంలో కొనసాగుతోందని పేర్కొన్నారు. అంతేకాక ఎన్ఆర్సీ పైనా దీదీ కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీ ప్రారంభిస్తుందని ఎన్ఆర్సీ అమలు వల్ల ఓటర్ల పేర్లు తొలగించి, ప్రజలను డిటెన్షన్ క్యాంపులకు తరలించే ప్రమాదం ఉందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
అలాగే బెంగాల్ లో ఇప్పటి వరకూ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి దాదాపు 91 లక్షల మంది పేర్లను తొలగించారని అందులో దాదాపు 60 లక్షల మంది హిందువులు ఉన్నారని అలాగే 30 లక్షల మంది ముస్లింలు ఉన్నారని మమతా బెనర్జీ తెలిపారు. ఇదంతా ఎన్నికల్లో భాగంగా కేంద్రం కుట్ర అని మండిపడ్డారు. అంతేకాక బెంగాల్ ను డీలిమిటేషన్ పేరుతో ముక్కలు చేయలని బీజేపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ లో భాగంగా బెంగాల్ లోని కొన్ని జిల్లాలను బిహార్, ఒడిషాలో కలిపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు.

ఇక బెంగాల్ లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో బెంగాల్ లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 152 స్థానాలకు, రెండో విడతలో 142 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే మే 4 న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
-
కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications