మీ కాళ్లు పట్టుకుంటా!: క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ గురువారం నాడు పెట్టుబడిదారులకు క్షమాపణలు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో ‘బెంగాల్‌ గ్లోబల్‌ సమ్మిట్‌' పేరిట పెట్టుబడిదారుల సదస్సును ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే.

గురువారం గ్లోబల్ ఇన్వెస్టర్ల మీట్‌లో మమత మాట్లాడారు. ఆమె పారిశ్రామివేత్తలకు క్షమాపణలు చెప్పారు. వామపక్ష ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక దుర్నిర్వహణకు తాను క్షమాపణ అడుగుతున్నానని చెప్పారు.

ఇకనైనా తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. గతంలో జరిగిన వాటిని మరిచిపోవాలని, గతంలో జరిగిన దానికి తాను క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. అప్పుడు జరిగిన చెడును వదిలేద్దామని, రేపటి గురించి ఆలోచించుదామన్నారు.

మమతా బెనర్జీ

మమతా బెనర్జీ

గత ప్రభుత్వం కారణంగా తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం కేంద్రం 21వేల కోట్లు, గత ఏడాది, 25వేల కోట్లు, ఈ ఏడాది 28వేల కోట్లు తీసుకుందని, అలాంటప్పుడు తాము ప్రజల కోసం ఎలా పని చేయాలో అర్థం కావడం లేదని అభిప్రాయపడ్డారు.

మమతా బెనర్జీ

మమతా బెనర్జీ

ఈ సమ్మిట్ ద్వారా ఇప్పటి వరకు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంవోయు కుదిరాయని చెప్పారు. ఇది చాలా అద్భుతమన్నారు.

మమతా బెనర్జీ

మమతా బెనర్జీ

ఇంత బాగా స్పందన వచ్చినందుకు మీ పాదాలు పట్టుకుంటానని, మీకు సెల్యూట్ చేస్తున్నానని సమ్మిట్‌కు వచ్చిన పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి అన్నారు.

మమతా బెనర్జీ

మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ గురువారం నాడు పెట్టుబడిదారులకు క్షమాపణలు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+