సీఆర్పీఎఫ్‌పై మమత వ్యాఖ్యలపై ఈసీ సీరియస్- రేపటిలోగా వివరణ కోరుతూ నోటీసులు
పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారా స్దాయికి చేరుకుంటోంది.. ఇందులో కేంద్ర బలగాలు సైతం విమర్శల పాలవుతున్నాయి. బీజేపీ కేంద్ర బలగాల సాయంతో ఓటర్లను భయపెట్టి ఓట్లు వేయించుకుంటోందంటూ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు ఇప్పుడు కొత్త వివాదానికి ఆజ్యం పోశాయి.
కేంద్ర బలగాల్ని టార్గెట్ చేస్తూ మమతా బెనర్జీ పదే పదే చేస్తున్న విమర్శలపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ఎన్నికల సంఘం మమతా బెనర్జీకి నోటీసులు జారీ చేసింది. మమత వ్యాఖ్యలు ప్రజల్లో ఆందోళన నింపేలా, రెచ్చగొట్టేలా ఉన్నాయని ఈసీ నోటీసులో పేర్కొంది. తాజాగా సీఆర్పీఎఫ్‌ను దిగ్బంధించండి అంటూ కూచ్‌బెహార్ ర్యాలీలో మమత చేసిన వ్యాఖ్యలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని నోటీసులో ఈసీ తెలిపింది.

Recommended Video
మార్చి 28న ఓ టీవీ ఇంటర్వ్యూలో మమత చేసిన వ్యాఖ్యలతో పాటు ఏప్రిల్ 7న కూచ్‌బెహార్ ర్యాలీలో చేసిన కామెంట్లను పరిగణనలోకి తీసుకుని నోటీసులు జారీ చేసినట్లు ఈసీ వెల్లడించింది. మమత వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిలోని సెక్షన్ 186, 189,504కింద శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నట్లు ఈసీ తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని బెంగాల్ సీఎంను ఈసీ ఆదేశించింది. ఏప్రిల్ 10లోగా మమత వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.












Click it and Unblock the Notifications