మమతా బెనర్జీ ఆగ్రహం: షాక్ తిన్న దేవెగౌడ, కుమారస్వామి?(వీడియో)

బెంగళూరు: బుధవారం జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో కర్ణాటక విధానసౌద చుట్టుపక్కల ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. కాంగ్రెస్, జేడీఎస్ అభిమానులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

జనం కిక్కిరిసిపోవడంతో ట్రాఫిక్ నియంత్రించడం పోలీసులకు కూడా కష్టంగా మారింది. దీంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సైతం ట్రాఫిక్ తిప్పలు లేదు. విధానసౌద మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రమాణస్వీకార కార్యక్రమానికి చేరుకోవడానికి చాలా సమయమే పట్టింది.

Mamata Banerjee loses cool after being forced to walk, slams Karnataka DGP
ట్రాఫిక్ ని నియంత్రించడంలో పోలీసులు విఫలమవడం మమతకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ప్రమాణస్వీకార ప్రాంగణం వద్దకు రాగానే.. కర్ణాటక డీజీపీ నీలమణి రాజుపై ఆమె మండిపడ్డారు. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసే తీరు ఇదేనా అంటూ మండిపడ్డారు. అంతేకాదు, అక్కడినుంచి ముందుకెళ్లి మాజీ ప్రదాని దేవెగౌడ, కుమారస్వామిలను కలిసిన మమతా.. వాళ్ల వద్ద కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

మమతా బెనర్జీ ఆగ్రహాన్ని చూసి దేవెగౌడ, కుమారస్వామిలు సైతం షాక్ అవక తప్పలేదు. మమతా డీజీపీపై మండిపడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+