మమతా బెనర్జీకి షాక్, ఆశ్చర్యం: బీజేపీలో చేరిన మంత్రి మంజుల్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి భారతీయ జనతా పార్టీ గట్టి షాకిచ్చింది. బెంగాల్‌లో బీజేపీ క్రమంగా బలపడుతోందనే విషయం తాజా సంఘటనతో మరోసారి వెలుగులోకి వచ్చింది. మమత కేబినెట్లోని మంత్రి మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.
టీఎంసీ సభ్యత్వంతో పాటు రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆ పార్టీ నేత మంజుల్ కృష్ణ ఠాకూర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అరాచక పాలన సాగిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఆ పార్టీలో మంచివారికి చోటు లేదని నిప్పులు చెరిగారు.
మమతా బెనర్జీ పాలన వల్ల రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారయిందన్నారు. ఈ కారణంగానే తాను మంత్రి పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని కూడా ఆమె నెరవేర్చడం లేదని ఆరోపించారు. తాము వీధల్లోకి వెళ్లనప్పుడు ప్రజలు పాలన పైన తమను ప్రశ్నిస్తున్నారన్నారు.

బీజేపీపై మమతాగ్రహం
ప్రాంతీయ పార్టీల పైన జాతీయ పార్టీలు అణిచివేత ధోరణి అవలంభిస్తున్నాయని, ఇది సరికాదని మమతా బెనర్జీ అన్నారు. మంత్రి పదవిలో ఉన్నా, మంజుల్ కృష్ణ ఠాకూర్ తన పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరడం మమతను ఆశ్చర్యానికి గురి చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆమె బీజేపీ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల ప్రోద్బలంతోనే ఆయన తమ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారని ఆమె భావిస్తున్నారు. బీజేపీ పేరును ప్రస్తావించకుండానే ఆమె జాతీయ పార్టీలు అంటూ కమలం పార్టీ పైన అక్కసు వెళ్లగక్కారు.












Click it and Unblock the Notifications