వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమ బెంగాల్ పోరు .. వీల్ చైర్ నుండి లేచి నిలబడి జాతీయ గీతాన్ని గౌరవించిన మమతా బెనర్జీ

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్లో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది . రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రచారం మంగళవారంతో ముగియడంతో పోలింగ్ నాడు ఓటర్ల తీర్పు ఏంటి అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నందిగ్రామ్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన మమతా బెనర్జీ , తనపై దాడి జరిగిన తర్వాత కాలికి అయిన గాయం వల్ల వీల్ చైర్ లోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే రెండో విడత ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది .

మొదటి విడత ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ఆసక్తికర పరిణామం

మొదటి విడత ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ఆసక్తికర పరిణామం

నిన్నటి ఎన్నికల ప్రచారంలో జాతీయ గీతం జనగణమన వినిపిస్తుంటే మమతా బెనర్జీ వీల్ చైర్ నుంచి లేచి నిలబడ్డారు. ఆమె లేచి నిలబడేందుకు అక్కడే ఉన్న సహాయకులు ఆమెకు తోడ్పాటు అందించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో సురేంద్ర అధికారిపై పోటీచేసి నందిగ్రామ్ నుండి ఎన్నికల బరిలోకి దిగిన మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ పై నిప్పులు చెరిగారు . అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ మమతా బెనర్జీ పై చేసిన విమర్శలకు గట్టిగా సమాధానం చెప్తూనే బీజేపీపై ఎదురు దాడి చేశారు.

కాలికి గాయం కావటంతో వీల్ చైర్ లోనే మమత ఎన్నికల ప్రచారం

కాలికి గాయం కావటంతో వీల్ చైర్ లోనే మమత ఎన్నికల ప్రచారం

కాలికి గాయం అయినప్పటికీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు.

వీల్ చైర్ లో కూర్చునే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించారు మమతా బెనర్జీ. ర్యాలీ లలోను, పాదయాత్రల లోనూ ఆమె ప్రధానంగా వీల్ చైర్ లోనే కనిపించారు. ఇక రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని ముగించే సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ తనకు కలిగిన గాయాల కారణంగా, తాను బీజేపీకి లొంగితే అది ప్రజల బాధగా మారుతుందన్నారు.

నిలబడలేని స్థితిలోనూ లేచి నిలబడి జాతీయ గీతానికి గౌరవం ఇచ్చిన దీదీ

నిలబడలేని స్థితిలోనూ లేచి నిలబడి జాతీయ గీతానికి గౌరవం ఇచ్చిన దీదీ

అప్పుడు తాను పడే బాధ కంటే ప్రజలు పడే బాధ పెద్దదవుతుందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తనకు తగిలిన దెబ్బను సైతం తట్టుకొని బిజెపి ని ఎన్నికల్లో దెబ్బ కొట్టాలని చూస్తున్న మమతా బెనర్జీ జాతీయ గీతానికి తగిన గౌరవం ఇచ్చారు. నిలబడలేని స్థితిలోకి కూడా లేచి నిలుచుని జాతీయ గీతమైన జనగణమన పట్ల తనకున్న గౌరవాన్ని అందరికి అర్థం అయ్యేలా చేశారు.


ఏది ఏమైనా నాలుగు రాష్ట్రాలు , ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్ ఎన్నికలపైనే ప్రధానంగా అందరి ఫోకస్ ఉంది .

English summary
Mamata Banerjee paid due respect to the national anthem. On the last day of the second phase election campaign yesterday, she stood up even to the point of not being able to stand up and made everyone understand her respect for the national anthem.However, with elections in four states and one union territory, the focus is mainly on the West Bengal elections. The fight is seen as a Cold War between the Trinamool Congress and the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X