వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతతో దీక్ష విరమింప చేసిన చంద్రబాబు, కోల్‌కతాలో ఊగిపోయిన ఏపీ సీఎం

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన దీక్షను మంగళవారం విరమించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమెతో దీక్ష విరమింపజేశారు. ఆమె కోల్‌కతాలో దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం తదితర కేంద్ర నేతలు అక్కడకు వెళ్లి ఆమెకు సంఘీభావం తెలిపారు. అనంతరం దీక్ష విరమింప చేశారు.

టీడీపీకి బీజేపీ డోర్లు క్లోజ్: అమిత్ షాకు టీడీపీ గట్టి కౌంటర్, జగన్‌కు డబ్బివ్వడం ఇష్టంలేదుటీడీపీకి బీజేపీ డోర్లు క్లోజ్: అమిత్ షాకు టీడీపీ గట్టి కౌంటర్, జగన్‌కు డబ్బివ్వడం ఇష్టంలేదు

కమిషనర్ ధర్నాలో కూర్చున్నారని ఎలా అంటారు

కమిషనర్ ధర్నాలో కూర్చున్నారని ఎలా అంటారు

ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడారు. తాను సేవ్ ఇండియా నినాదంతో ధర్నా చేశానని చెప్పారు. కోల్‌కతాను చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కోల్‌కతా పోలీసులు తన ధర్నాలో కూర్చున్నారని చెబుతున్నారని, కానీ వారు కూర్చోలేదన్నారు. కమిషనర్ ధర్నాలో ఉన్నారని కేంద్రం ఎలా చెబుతుందని ఎలా అంటారని ప్రశ్నించారు. నరేంద్ర మోడీని గద్దెదించి గుజరాత్‌కు పంపిస్తామని చెప్పారు. ఈ కేసుపై తాను ఢిల్లీలో పోరాడుతానని చెప్పారు. సుప్రీం కోర్టు తమకు అనుకూల తీర్పు ఇచ్చిందన్నారు. అన్ని వ్యవస్థలను చేతిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఏపీ, బెంగాల్, ఢిల్లీల అభివృద్ధిని అడ్డుకుంటోంది

ఏపీ, బెంగాల్, ఢిల్లీల అభివృద్ధిని అడ్డుకుంటోంది

చంద్రబాబు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం మమతా బెనర్జీని బ్లేమ్ చేస్తోందని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. కేంద్రంలో ఇలాంటి పార్టీని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలోను ఇలా లేదన్నారు. ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉందని చెప్పారు. ఏపీ, బెంగాల్, ఢిల్లీ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటుందని చెప్పారు. బీజేపీ అన్ని వ్యవస్థలను నాశనం చేస్తోందన్నారు.

బీజేపీ నేతలు తప్పా మిగతా వారంతా అవినీతిపరులా

బీజేపీ నేతలు తప్పా మిగతా వారంతా అవినీతిపరులా

శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిది అని చంద్రబాబు చెప్పారు. కొన్ని అంశాలే కేంద్రం పరిధిలో ఉంటాయని తెలిపారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని నిప్పులు చెరిగారు. బ్యాంకులను దోచుకున్న వారిని దేశం నుంచి పంపించారని ధ్వజమెత్తారు. అమిత్ షా, ఆయన కొడుకు ఆస్తి 69 శాతం పెరిగిందన్నారు. బీజేపీ నేతలు తప్ప మిగతా వారంతా అవినీతిపరులా అని ప్రశ్నించారు.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee in Kolkata: They (Central govt) want to control all the agencies including the state agencies also? PM you resign from Delhi and go back to Gujarat. One man govt, one party government is there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X