ప్రధాని 'లైవ్'కు బెంగాల్ నో: మోడీకి మమతా బెనర్జీ షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్‌కత్తా: ప్రధాని నరేంద్ర మోడీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ షాకిచ్చారు. మోడీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు మమతా బెనర్జీ గండికొట్టారు.

అప్పుడు మాట్లాడలేదే: సనాతన్ సంస్థ, గౌరీ లంకేష్ కాల్చివేతలో సోదరుడి కొత్త ట్విస్ట్

మమత సర్కార్ బేఖాతరు

మమత సర్కార్ బేఖాతరు

ఈ నెల 11న మోడీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారానికి కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఏర్పాట్లు చేయాల్సిందిగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలను మమత సర్కార్ బేఖాతరు చేసింది.

మా పరిధిలో కాలేజీలు కేంద్రం ఆదేశాలు పాటించొద్దు

మా పరిధిలో కాలేజీలు కేంద్రం ఆదేశాలు పాటించొద్దు

తమ పరిధిలోకే వచ్చే కాలేజీలు, యూనివర్శిటీల్లో యూజీసీ ఆదేశాలను పాటించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ఉపన్యసించి 125 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని మోడీ ఈ నెల 11న ప్రసంగించనున్నారు.

మేం వ్యతిరేకిస్తున్నామని మంత్రి

మేం వ్యతిరేకిస్తున్నామని మంత్రి

దీనిని ప్రత్యక్ష ప్రసారంగా అందించనున్నారు. కాగా, లైవ్ టెలికాస్ట్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు బెంగాల్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ శుక్రవారంనాడు సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

కాషాయీకరణ చేసేందుకే

కాషాయీకరణ చేసేందుకే

రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా కేంద్రం తీసుకునే నిర్ణయాలను తాము పాటించలేమని మంత్రి తెలిపారు. ఇది మాకెంత మాత్రం ఆమోదయోగ్యం కాదని, విద్యను కాషాయీకరణ చేసేందుకే ఇలాంటి చర్యకు పాల్పడుతున్నారని, దీనిని తాము అంగీకరించేది లేదని చెప్పారు.

సర్క్యులర్ ఇచ్చాకే మమ్మల్ని సంప్రదించారు

సర్క్యులర్ ఇచ్చాకే మమ్మల్ని సంప్రదించారు

రాష్ట్రంలోని కాలేజీలు, యూనివర్శిటీలకు సర్క్యులర్ ఇచ్చారని, ఆ తర్వాతే మమ్మల్ని సంప్రదించారని, యూజీసీ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని తాము చాలా స్పష్టంగా చెప్పామని మంత్రి ఛటర్జీ తెలిపారు.ొ

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Mamata Banerjee government in West Bengal has once again taken on the centre, this time on its move to air Prime Minister Narendra Modi’s speech live at colleges and universities. The state government has directed all the universities and colleges under its jurisdiction to ignore the directive of University Grants Comission (UGC) to arrange live telecast of Modi’s speech on September 11 on the occasion of the 125th anniversary of Swami Vivekananda’s address to the World Parliament of Religions in Chicago.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X