వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతీ సారీ సోనియాతో ఎందుకు కలవాలి - దీదీ వ్యాఖ్యల వెనుక : కొత్త వ్యూహాలతో మమత అడుగులు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

వరుసగా మూడో సారి బెంగాల్ లో అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తన పార్టీ విస్తరణ దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో విస్తరణ కోసం వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన మమతా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో సమావేశం అవుతారా అని ప్రశ్నించిన సమయంలో దీదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సోనియాకు ఎందుకు కలవాలి

సోనియాకు ఎందుకు కలవాలి

ప్రతీసారి సోనియాకు ఎందుకు కలవాలి..అదేమీ రాజ్యంగబద్దమైన విధి కాదు కదా అంటూ వ్యాఖ్యానించారు. వారంతా పంజాబ్ ఎన్నికల అంశంలో బిజీగా ఉన్నారంటూ కామెంట్ చేసారు. దీని ద్వారా కాంగ్రెస్ తో ఇక కలిసేందుకు దీదీ సిద్దంగా లేరనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. బీజేపీ..మోదీని టార్గెట్ చేసిన మమతా.. ఇప్పుడు కాంగ్రెస్ తోనూ దూరంగానే ఉండాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజులుగా అటు గోవాలో..ఇటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ మమత తన పార్టీ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా పలువురు నేతలు టీఎంసీలోకి ఆహ్వానించారు.

పలు ప్రాంతాల్లో పార్టీ బలోపేతం కోసం చేరికలు

పలు ప్రాంతాల్లో పార్టీ బలోపేతం కోసం చేరికలు

గోవాలోని లుయిజిన్హో ఫలేరో, దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ, సిల్చార్ నుండి కాంగ్రెస్ మాజీ ఎంపీ సుస్మితా దేవ్ మరియు దివంగత కాంగ్రెస్ ప్రముఖుడు సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె వంటి వారు టీఎంసీలో చేరారు. ఇక, బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి తాను సహకరించటానికి సిద్దంగా ఉన్నానంటూ మమతా సంకేతాలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీని ఓడించేందుకు అఖిలేష్ కు సమాయం కావాలంటే అందించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.

మహారాష్ట్రలోనూ కీలక మంతనాల దిశగా

మహారాష్ట్రలోనూ కీలక మంతనాల దిశగా

అదే విధంగా సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న మహారాష్ట్ర పైన మమత పరోక్ష సంకేతాలు ఇచ్చారు. డిసెంబర్ 1న దీదీ ముంబాయి వెళ్లనున్నాయి. అక్కడ జరిగే బిజినెస్ సమ్మిట్ కు సంబంధించి పాల్గొనేందుకు వెళ్తున్న బెంగాల్ సీఎం.. అదే సమయంలో సీఎం ఉద్ద్ థాక్రేతో పాటుగా శరద్ పవార్ తోనూ కలవనున్నారు. ఇక, ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశికి మమతా వెళ్లనున్నారు. అక్కడ కమలాపతి త్రిపాఠి కుటుంబం కొద్ది రోజుల క్రితం తృణమూల్‌లో చేరారు.

Recommended Video

Telangana : జాతీయ రాజకీయాల్లో CM KCR అడుగులు.. Mamata Banerjee తో భేటీ! || Oneindia Telugu
వారణాశికి మమతా బెనర్జీ

వారణాశికి మమతా బెనర్జీ

యుపి మాజీ ముఖ్యమంత్రి కమలాపతి త్రిపాఠి మనవళ్లు రాజేష్‌పతి త్రిపాఠి మాజీ ఎమ్మెల్సీగా.. లలితేష్‌పతి త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేగా ఉన్నారు. మమతా వారి కోసం ఇప్పుడు వారణాశి వెళ్లాలని నిర్ణయించటం కూడా భవిష్యత్ సమీకరణాలకు నాంది పలుకుతోంది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బలం పెంచుకోవటంతో పాటుగా.. 2024 ఎన్నికలే లక్ష్యంగా మమతా బెనర్జీ వ్యూహాత్యకంగా రాజకీయ అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

English summary
Mamata Banerjee is politically implementing strategies to expand in various parts of the country. The remarks made on the topic of meeting Sonia Gandhi recently are leading to new equations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X