కూతురిపై అత్యాచారం చేశాడని కేసు: వ్యక్తి ఆత్మహత్య
ఔరంగాబాద్: కూతురిపై అత్యాచారం చేశాడనే ఆరోపణపై కేసును ఎదుర్కుంటున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చేటు చేసుకుంది. పదేళ్ల కూతురిపై అత్యాచారం చేశాడని జిన్సీ పోలీసు స్టేషన్‌లో డిసెంబర్ 26వ తేదీన ఓ కేసు నమోదైంది.
ఆ 45 ఏళ్ల వ్యక్తి గురువారంనాడు ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం అతను ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ వ్యక్తి స్క్రాప్ డీలర్. బాజీపురలో నివసిస్తాడు. డిసెంబర్ 26వ తేదీన అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు అందగానే అతను కనిపించకుండా పోయాడు.

గురువారం సాయంత్రం 3 గంటలకు అతను క్రాంతి చౌక్ ఫ్లైఓవర్ సమీపంలోని ఖదీం మసీదు వద్ద విషపూరితమైన ద్రవం తీసుకున్నాడని, అతను తన కుమారుడికి ఫోన్ చేసి తాను ఇక బతకలేనని చెప్పాడని, దాంతో కుమారుడు తాను వస్తున్నాను, అక్కడే ఉండాలని చెప్పాడని, కుమారుడు వెళ్లే సరికే అతను స్పృహ కోల్పోయాడని, అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారని, అతను శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో మరణించాడని పోలీసులు చెప్పారు.
బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు అతన్ని అనుమానితుడిగా నమోదు చేశారు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారని, మొదటి భార్యతో అతనికి ముగ్గురు పిల్లలున్నారని, వారిలో ఇద్దరు కుమారులు కాగా ఒకరు కూతురు అని, రెండో భార్యతో ఓ కూతురు ఉందని పోలీసులు చెప్పారు. తన కూతురిని పాఠశాల నుంచి తక్షిలనగర్‌లోని నిర్మానుష్యమైన ఇంటికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications