వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి కుర్చీలో సెల్ఫీలు, సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి నేనే మంత్రి అన్నాడు, చివరికి!

|
Google Oneindia TeluguNews

లక్నో: తన వ్యక్తి గత పని మీద ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రిని కలవడానికి వెళ్లిన యువకుడు ఆయన కార్యాలయంలో లేని విషయం తెలుసుకున్నాడు. తరువాత నేరుగా వెళ్లి మంత్రి కుర్చీలో కుర్చుని ఓ సెల్ఫీ తీసుకున్నాడు. అంతటిలో ఆ విషయాన్నిఅతను వదిలిపెట్టలేదు.

నేను మంత్రి కుర్చీలో కుర్చున్నాను అంటూ ఆ ఫోటో సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే విషయం తెలుసుకున్న మంత్రికి మండిపోయింది. మంత్రిగారి కార్యదర్శి ఫిర్యాదు చెయ్యడంతో ఉత్తరప్రదేశ్ సైబర్ క్రైం పోలీసులు మంత్రి కుర్చీలో కుర్చుని సెల్ఫీ తీసుకున్న యువకుడి కోసం గాలించి 24 గంటల్లోనే అరెస్టు చేశారు.

సహచరులతో కలిసి !

సహచరులతో కలిసి !

ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి ప్రాంతంలో నివాసం ఉంటున్న అజయ్ తివారి అనే యువకుడు కటకటాలపాలైనాడు. గురువారం అజయ్ తివారి తన సహచరులతో కలిసి ఉత్తరప్రదేశ్ సచివాలయంలోని విద్యాశాఖ మంత్రి సందీప్ సింగ్ కార్యాలయానికి పని మీద వెళ్లాడు.

మంత్రి కుర్చీలో సెల్ఫీ

మంత్రి కుర్చీలో సెల్ఫీ

విద్యాశాఖ మంత్రి సందీప్ సింగ్ బయటకు వెళ్లారని తెలుసుకున్నారు. కార్యాలయంలో ఎవ్వరూ లేకపోవడంతో అక్కడికి వెళ్లిన వారు బయటకు వచ్చారు. అజయ్ తివారి మాత్రం మంత్రి సందీప్ సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లాడు. మంత్రి కుర్చీలో కుర్చున్న అజయ్ తివారీ చక్కగా ఓ సెల్ఫీలు తీసుకున్నాడు.

Recommended Video

Virat Kohli posts selfie with 'love' Anushka Sharma
లైక్ లతో మురిసిపోయాడు

లైక్ లతో మురిసిపోయాడు

సెల్ఫీలు తీసుకున్న తరువాత అజయ్ తివారి నేను విద్యాశాఖ మంత్రి సందీప్ సింగ్ సీటులో కుర్చున్నాను, నేను ఇప్పుడు మంత్రి అంటూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చూసిన అనేక మంది నెటిజన్లు లైక్ ల వర్షం కురిపించారు. అన్నా నువ్వు సూపర్, నీకు ధైర్యం ఎక్కువ అంటూ అజయ్ తివారీని పొగడ్తలతో ముంచెత్తారు.

మంత్రి మీద దుమ్మెత్తి పోశారు

మంత్రి మీద దుమ్మెత్తి పోశారు

తన ఫోటోలు చూసిన వారు లైక్ లతో అభినందించడంతో అజయ్ తివారీ మురిసిపోయాడు. అయితే విషయం గుర్తించిన ఉత్తరప్రదేశ్ ప్రజలు మంత్రి మీద దుమ్మెత్తిపోశారు. మీ కార్యాలయంలోకి వచ్చి సెల్ఫీలు తీసుకుని ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టినా మీరు పట్టించుకోవడంలేదని మంత్రిని విమర్శించారు.

ఒక్క సెల్ఫీ జీవితాన్ని మార్చేసింది

ఒక్క సెల్ఫీ జీవితాన్ని మార్చేసింది

కార్యాలయానికి వెళ్లిన మంత్రి సందీప్ సింగ్ కు ఈ విషయం తెలిసింది. నా సీటులోనే కుర్చుంటారా అంటూ ఆయనకు మండిపోయింది. వెంటనే తన కార్యదర్శి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించి 24 గంటల తిరగకముందే అజయ్ తివారీని గుర్తించి అరెస్టు చేశారు. సెల్ఫీల పిచ్చితో పాపం అజయ్ తివారీ ఇప్పుడు జైలుకు వెళ్లాడు.

English summary
A Barabanki man was arrested for getting himself photographed while sitting on the chair of Uttar Pradesh's education minister Sandeep Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X