మూడేళ్ల చిన్నారిపై లైంగికదాడి, ఇంట్లో ఆశ్రయమిస్తే పాడుపని, పోలీసుల అదుపులో..
వావి, వరస లేదు, చిన్న, పెద్ద అనే తేడా కూడా తెలియదు. పసి వాళ్ల నుంచి ముసలి వరకు ఎవరినీ వదలడం లేదు. ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ముంబైలోని థానెలో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

చిన్నారిపై..
థానేలోని కసర్వాడవల్లిలో కుటుంబం నివసిస్తోంది. వారికి మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. అయితే వారితోపాటు ఓ 27 ఏళ్ల యువకుడు సుభాష్ దూబే కూడా ఉంటున్నాడు. పనీ పాట లేకుండా ఖాళీగా ఉంటోన్న అతనికి కుటుంబం ఆశ్రయం ఇచ్చింది. సుభాష్ కుటుంబ సభ్యులకు బంధువు కూడా అవుతారు. ఉపాధి చూసుకోవాల్సిన యువకుడు తమ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

లైంగికదాడి
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. తర్వాత ఇంటికొచ్చిన తన తల్లితో నొప్పిగా ఉందని చెప్పింది. దీంతో చిన్నారిపై యువకుడు లైంగికదాడి చేశారని వారు భావించారు. గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అరెస్ట్
బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు సుభాష్ దూబేను అరెస్ట్ చేశారు. యువకుడిపై పోలీసులు ఐపీసీ 376 కింద కేసు నమోదుచేశారు. దీంతో పాటు పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. వైద్య పరీక్షల కోసం చిన్నారిని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications