పక్కింటి బాత్‌రూమ్‌లో కెమెరా, నగ్న దృశ్యాల కోసం, బాధితులేం చేశారంటే?

బెంగుళూరు: టెక్నాలజీ పెరిగిన తర్వాత మంచి కోసం కంటే చెడు కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయి. స్మార్ట్‌పోన్స్, స్పై కెమెరాలు ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చాయి. అయితే సమాజానికి ఉపయోగపడే పనులు చేయడానికి బదులుగా వీటిని ఎక్కువగా చెడు పనుల కోసం ఉపయోగిస్తున్నారు. పక్కింటి బాత్‌రూమ్‌లో రహస్యంగా కెమెరాను అమర్చిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.

టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవంటే అది సమాజానికి అలా ఉపయోగపడుతోంది. ఇరుగుపొరుగుతో సఖ్యతగా ఉండకుండా వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం.

పక్కింటి బాత్‌రూమ్‌లో వారికి తెలియకుండానే రహస్యంగా కెమెరాను అమర్చిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకొంది . ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.

పక్కింటి బాత్‌రూమ్‌లో కెమెరా

పక్కింటి బాత్‌రూమ్‌లో కెమెరా

కర్ణాటక రాష్ట్రంలోని బనశంకరి ప్రాంతంలోని సార్వభౌమనగర్‌లో నివాసం ఉంటున్న ఓ యువకుడు పక్కింట్లోని బాత్‌రూమ్‌లో రహస్యంగా కెమెరాను అమర్చాడు. అయితే ఈ కెమెరా సహయంతో బాత్రూమ్‌లో దృశ్యాలను రికార్డ్ చేయాలని నిందితుడు ప్లాన్ చేశాడు. ఈ విషయం ఎవరికీ తెలియదని భావించాడు. కానీ, కెమెరా ఏర్పాటు చేసిన విషయాన్ని కుటుంబ సభ్యులు ఎట్టకేలకు గుర్తించారు.

బాత్‌రూమ్‌లో కెమెరాను ఎలా గుర్తించారంటే

బాత్‌రూమ్‌లో కెమెరాను ఎలా గుర్తించారంటే

నిందితుడు ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అయితే పక్కింటి బాత్‌రూమ్‌లో రహస్యంగా కెమెరా పెట్టాలనే తప్పుడు ఆలోచన కలిగింది. చుట్టుపక్కల వారు ఎవరూ గమనించకుండా ఉన్న సమయాన్ని చూసి కెమరాను ఏర్పాటు చేశారు. అయితే తమ బాత్‌రూమ్ వెంటిలేటర్ వద్ద ఏదో కొత్త వస్తువును గుర్తించిన బాధిత కుటుంబం దాన్ని పరిశీలించింది. అప్పుడు కెమెరాగా గుర్తించారు.

నిందితుడిని ఇలా

నిందితుడిని ఇలా

సభ్య సమాజం తలదించుకొనేవిధంగా నిందితుడు వ్యవహరించాడు. పక్కింట్లోనే ఉంటున్న యువకుడే ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధిత కుటుంబం గుర్తించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కఠినంగా శిక్షించాలని డిమాండ్

కఠినంగా శిక్షించాలని డిమాండ్

బాత్‌రూమ్‌లో కెమెరాను ఏర్పాటు చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఈ తరహ ఘటనలు భవిష్యత్తులో చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+