11 ఏళ్ల బాలిక మీద అత్యాచారం, చంపేస్తానని బెదిరింపులు, కామాంధుడు అరెస్టు !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఇంటిలో ఒంటరిగా ఉన్న బాలిక మీద అత్యాచారం చేసిన కామాంధుడిని కర్ణాటకలోని గదగ్ జిల్లా గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. గదగ్ పట్టణం సమీపంలో నివాసం ఉంటున్న రమేష్ హోసమని (22) అనే కామాంధుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

ఈనెల 23వ తేదీన 11 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులు అందరూ పనిమీద బయటకు వెళ్లారు. ఇంటిలో బాలిక ఒంటరిగా ఉన్న విషయం గుర్తించిన రమేష్ ఆమె మీద అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించిన రమేష్ పరారైనాడు.

Man arrested for trying to rape 11-year-old girl in Karnataka

మంగళవారం బాలిక ఆరోగ్యంలో మార్పు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలిక మీద అత్యాచారం జరిగిందని వైద్యులు దృవీకరించడంతో బాధితులు గదగ్ జిల్లా గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక రమేష్ గురించి చెప్పడంతో అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బుధవారం పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
22-year-old man arrested for trying to rape 11-year-old girl in Gadag, case filed against accused under POCSO act

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి