దుర్గామాత ప్రసన్నం కోసం కన్న కొడుకునే నరికి..

ఫైజాబాద్: మూఢ నమ్మకంతో కన్న కొడుకునే చంపుకున్నాడు ఓ కిరాతక తండ్రి. ఈ ఘోర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేన్ పూర్వ గ్రామంలో నివాసముంటున్న రాజ్‌కుమార్ చౌరాసియా అకహేమంత్ దుర్గా మాతను ప్రసన్నం చేసుకునేందుకు బారబంకి‌లోని అమ్మవారి విగ్రహం ముందు తన 9ఏళ్ల కుమారుడ్ని నరికి చంపాడు.

Man axes infant son to please goddess

పోలీసుల కథనం ప్రకారం.. రాజ్‌కుమార్ తన కుమారునికి స్నానం చేయించి తన ఇంటికి దగ్గరలోని దుర్గామాత ఆలయానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కొడుకు తల నరికి దుర్గామాతకు బలి ఇచ్చాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తన కుమారుడ్ని కాపాడాలని అరుచుకుంటూ ఘటనా స్థలానికి పరుగులు తీశారు. కానీ అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

నిందితుడు రాజ్‌కుమార్ అక్కడ్నుంచి పారిపోవాలని ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని అతనికి దేహశుద్ధి చేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. నిందితుడు రాజ్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఆఫీసర్ తిరుపతి తెలిపారు. కొడుకును హత్య చేసిన రాజ్‌కుమార్‌ ఘటన పట్ల ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+